కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్
“అన్న” నందమూరి తారక రామారావు స్ఫూర్తితో చేపట్టిన ‘అన్నా క్యాంటీన్’ ద్వారా ప్రతి పేదవాడికి కడుపునిండా అన్నం తినిపించడం ద్వారా మాత్రమే నిజమైన స్వతంత్రం సాధ్యమవుతుందని కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు.
జగ్గంపేటలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద గత రెండు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ అన్న క్యాంటీన్ నిర్వహించబడుతోంది. స్థానిక శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆదేశాల మేరకు ఈ సేవా కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సోమవారం గండేపల్లి మండలం ఎన్.టి. రాజాపురం గ్రామానికి చెందిన పరిమి వీర్రాజు అన్నపూర్ణ దంపతుల కుమారుడు పరిమి నాగేశ్వరరావు ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ, “అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో దేశ విదేశాల నుండి కూడా దాతలు సహకారం అందిస్తున్నారు. వారి మద్దతుతోనే ఈ అన్న క్యాంటీన్ సాఫల్యంగా ముందుకు సాగుతోంది,” అని అన్నారు. ఆయన దాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈరోజు పరిమి నాగేశ్వరరావు ఆర్థిక సహకారంతో పేదలకు అన్నదానం అందించామన్నారు.
ఈ కార్యక్రమంలో కోర్పు లచ్చయ్య దొర, పోతుల మోహనరావు, పరిమి బాబు, కందుల చిట్టిబాబు, కుంచె రాజా, కోర్పు సాయి తేజ, జీను మణి బాబు, బుర్రి సత్తిబాబు, వేములకొండ జోగారావు తదితరులు పాల్గొన్నారు.