ఎమ్మెల్యే విజయ్ చంద్ర
పల్లెల అభివృద్ధి ప్రభుత్వం ధ్యేయం ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురం మండలంలోని అడ్డాంపుశిల గ్రామంనుండి పిన్నింటి రామినాయడువలస గ్రామంవరకు రెండు కిలోమీటర్ల పొడవున 75 లక్షలు రూపాయలతో నిర్మించనున్న బిటిరోడ్డుపల్లె పండగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గద్దినెక్కించారని వారి ఆశలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని ఆయన అన్నారు.
ప్రజలు ఎంతగా ఆదరించారు. ప్రజలు తమ పైన ఉంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పల్లె ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చూపుతున్నారని ఎమ్మెల్యే వివరించారు. ఏ గ్రామంలో ఏ పనులు అవసరమో వాటిని పూర్తి చేసేందుకు అందుకు తగ్గ నిధులు విడుదల చేయడం కూడా జరిగిందని ఎమ్మెల్యే వివరించారు. మంచి పాలన అందించడమే పాలకుల లక్ష్యమని అందుకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.