Suryaa.co.in

Andhra Pradesh

ప్రజాసంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

– ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ: ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. మండలంలోని పల్లగిరి గ్రామంలో మంగళవారం జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

కూటమి ప్రభుత్వం ఏర్పాటై వందరోజులు పూర్తి అయిందన్నారు. ఇంత తక్కువ కాలంలోనే సీఎం చంద్రబాబు అనేక పథకాలను అమలు చేశారన్నారు. ముఖ్యంగా పింఛన్లపెంపు, ఉచిత ఇసుక పాలసీ, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు, మెగా డిఎస్సీ విడుదల, అన్న క్యాంటీన్ల ప్రారంభం తదితర వాటిని చేపట్టి ఇది చేతల ప్రభుత్వంగా నిరూపణ చేశారని తెలిపారు.

వచ్చే దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్‌ సిలెండర్‌ పథకాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.

LEAVE A RESPONSE