Suryaa.co.in

Telangana

సీవీసీకి రాష్ట్రం లేఖ రాయడమేంటి?

– అసలు ఏ రాష్ట్రమైనా తన ప్రభుత్వంపై విచారణ కోరుతుందా?
– మీ బుద్ధి మందగించిందా?
– ప్రభుత్వం లేఖ రాస్తే నువ్వు కేంద్రమంత్రిగా ఉండి ఏం ఫాయిదా?
– ‘అమృత్’ స్కాంలో కాంగ్రెస్-బీజేపీ కుమ్మక్కు
– మహేశ్వర్ రెడ్డి నోరు ఎందుకు మూగ పోయింది ?
– అమృత్ మీద మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీ లో ఎందుకు మాట్లాడలేదు ?
– కేంద్రమంత్రి సంజయ్, బీజేపీఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డిపై బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి ధ్వజం

హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ ,బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అమృత్ స్కాం పై స్పందించిన తీరు హాస్యాస్పదంగా ఉంది. బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కు లేఖ రాయాలని కోరడం విచిత్రంగా ఉంది. ఇంతకన్నా బుద్ది మాలిన విషయం ఉంటుందా ?

రాష్ట్రం లోని కాంగ్రెస్ పెద్దలను కాపాడే పని లో బండి సంజయ్ ఉన్నట్టు అర్థమవుతోంది. ఇలాంటి వ్యక్తి కేంద్రం లో మంత్రిగా ఉండటం దురదృష్టకరం. ఆరోపణలు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం సీవీసీ కి లేఖ రాస్తుందా ? మహేశ్వర్ రెడ్డి నోరు ఎందుకు మూగ పోయింది? అమృత్ మీద మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీ లో ఎందుకు మాట్లాడ లేదు?

ఇపుడు సీబీఐ విచారణ కోరాలని మహేశ్వర్ రెడ్డి రాష్ట్రాన్ని కోరుతున్నారు. కేంద్రం లో బీజేపీ అధికారం లో ఉన్నది గడ్డి పీకేందుకా ? మోడీ ఎక్కడికి వెళ్లినా బీజేపీ యేతర ప్రభుత్వాలకు కేంద్ర నిధులు atm గా మారాయంటారు. మరి అమృత్ నిధులు తెలంగాణ లో దుర్వినియోగం అవుతుంటే విచారణ కు ఎందుకు ఆదేశించరు ? కిషన్ రెడ్డి కూడా నోరు మెదపకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

కాంగ్రెస్ బీజేపీ లు రాష్ట్రం లో కుమ్మక్కయ్యాయని అమృత్ స్కాం నిరూపిస్తోంది. అమృత్ పనులను పెద్ద కాంట్రాక్టర్ల కు ఇవ్వాల్సిన పని లేదు. చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఇస్తే సరిపోతుంది. మిషన్ కాకతీయ పనులను చిన్న చిన్న కాంట్రాక్టర్లకు అప్పగించాం. కర్ణాటక బీజేపీ ని చూసి, తెలంగాణ బీజేపీ నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది.

అక్కడ కాంగ్రెస్ అవినీతి మీద బీజేపీ ఉద్యమిస్తుంటే, తెలంగాణ లో నోరు మూసుకుంది. ఎవరి ప్రోద్బలం తో బీజేపీ మౌనంగా ఉంటోంది?
సీఎం రేవంత్ తో ఇక్కడి బీజేపీ నేతలు కుమ్మక్కయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే బొజ్జు బీజేపీ నేతల పై అనుచిత వ్యాఖ్యలు చేసినా, ఇక్కడి బీజేపీ నేతలు మౌనంగానే ఉన్నారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు అమృత్ స్కాం పై విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలి.

LEAVE A RESPONSE