– మంత్రి వెంకట్ రెడ్డి కి కేసులు పెట్టించడం తప్ప వేరే పని ఏమీ లేదు
– విలేకరులను కూడా పిలిచి భయపెట్టిస్తున్నాడంట
– యాజమాన్యాలతో మాట్లాడి రిపోర్టర్ ల ఉద్యోగాలు ఊడ గొడుతున్నారు
– మీరు తెచ్చిన జీవో 33 వలన సూర్యాపేట,నల్గొండ జిల్లాలకు ఎక్కువ నష్టం
– ఖమ్మం జిల్లా మంత్రుల అత్యాశతో నాగార్జునసాగర్ కెనాల్ కు రెండు చోట్ల గండి
– మిర్యాలగూడ టిఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
మిర్యాలగూడ: గత తొమ్మిది నెలలుగా రాష్ట్రంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పరిపాలన పడకేసింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమనంలో నడుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తయి చేసింది ఏమీ లేకపోగా, ఉన్న వ్యవస్థలను కూడా సరిగా నడపలేకపోతున్నారు.
విద్య,వైద్యం తోపాటు ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారు.ఉన్న వ్యవస్థలను నాశనం చేసి, తెలంగాణ రాష్ట్రం అంటేనే భయపడేలా చేస్తున్నారు. ఉన్నవి కూలగొట్టడం తప్ప, కొత్తవి నిర్మించే ఆలోచన, తెలివి ఈ ప్రభుత్వానికి లేదు.
నల్గొండ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా ఇద్దరికి ఇద్దరు దద్దమ్మ లాగా ఉన్నారు.కృష్ణ గోదావరి నీళ్ల విషయంలో ఇద్దరు మంత్రులకు అవగాహన లేదు. మంత్రుల నిర్లక్ష్యంతో నీళ్లన్నీ సముద్రం పాలవుతున్నాయి.మన పంటలు ఎండిపోతున్నాయి. గత 60 ఏళ్లలో కాంగ్రెస్ పాలనలో ఉన్న పరిస్థితులే ఈ తొమ్మిది నెలలో పునరావతమవుతున్నాయి.
ఖమ్మం జిల్లా మంత్రుల అత్యాశతో నాగార్జునసాగర్ కెనాల్ కు రెండు చోట్ల గండి పడడం వాస్తవం. మేము ఖమ్మం కు నీళ్లు తీసుకుపోవద్దు అనడం లేదు.నేను మంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మం తో పాటు, మన జిల్లాకు కూడా నీళ్లు అందించాను. మా హయాంలో సాగర్ కాలువకు గండి పడితే, ఏడు రోజుల్లో పూర్తి చేశాం. కానీ ఇప్పుడు 20 రోజులైనా దిక్కు లేదు.
జిల్లా మంత్రులకు అక్రమ సంపాదన, బ్లాక్ బ్లాక్మెయిలింగ్ తప్ప, పరిపాలన మీద సోయలేదు. మీరు తెచ్చిన జీవో 33 వలన సూర్యాపేట,నల్గొండ జిల్లాలకు ఎక్కువ నష్టం వాటిల్లింది. సుప్రీంకోర్టు లెంపకాయి వేసి, అందరికీ అవకాశం కల్పించాలని చెప్పి నాలుగు రోజులైనా కౌన్సిలింగ్ ప్రారంభించలేదు. ఈ ప్రభుత్వం మెడికల్ కళాశాలలో చేరే విద్యార్థులకు అవకాశం కల్పిస్తారా లేదా అని చెప్పడం లేదు.
గత పదేళ్ల పాలనలో 1000 కి పైగా గురుకులాలు,30కి పైగా మెడికల్ కాలేజీలు కేసీఆర్ నాయకత్వంలో ఏరకంగా ప్రారంభించబడ్డాయో ప్రజలు చూశారు.రాష్ట్రంలో అప్పుడే పోలీసు రాజ్యం మొదలుపెట్టి పెట్టిండ్రు. వాళ్ల తప్పులపై ప్రశ్నించిన.. సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టిన అక్రమ కేసులు. చివరికి మీడియా మీద కూడా కేసులు పెట్టి బెదిరిస్తున్నారు.
స్థానికంగా అధికార పార్టీ నాయకుల వలన పొరపాటు జరిగిందని వార్తలు రాస్తే, వాళ్ళ యాజమాన్యాలతో మాట్లాడి రిపోర్టర్ ల ఉద్యోగాలు ఊడ గొడుతున్నారు. జిల్లా ఎస్పీతోపాటు ఇతర పోలీసు అధికారులకు చెప్తున్నా, మీరు నిబంధనలను అతిక్రమించి చిన్న తప్పు చేసిన శిక్షకు అర్హులు.
చట్ట ప్రకారమే పనిచేయండి. మంత్రుల ఎమ్మెల్యేలు హుకుం జారీ చేస్తే తప్పుడు కేసులు పెడతామంటే ఊరుకోం. మీరు చిక్కున పడతారు. పక్క రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయో అందరం చూస్తున్నాం. జిల్లా మంత్రి వెంకట్ రెడ్డి ఏమన్న పనిచేస్తుండంటే, అది కేసులు పెట్టించడం తప్ప వేరే పని ఏమీ లేదు.
నిన్న ఇయ్యాల విలేకరులను కూడా పిలిచి భయపెట్టిస్తున్నాడంట. ఇట్ల భయపెట్టించి రాజ్యం చేయడం ఎవరి వల్ల కాలేదు.చరిత్రలో ఎవరు నిలపడలే. ఇంకా నాలుగేళ్లు ఉంది. ముందుంది ముసళ్ళ పండుగ. అప్పుడే ఏం మొదలైందని పోలీసులు అడ్డం పెట్టుకుంటున్నారు.
ఈ జిల్లాలో మీరు వదిలిపెట్టి పోయిన కరువును, ఫ్లోరైసిస్ వ్యాధిని మేము రూపుమాపినం. రాష్ట్రంలో అందరికీ రుణమాఫీ అమలు చేయాలి. వెంటనే రాష్ట్రంలో రైతు భరోసా అమలు చేయాలి.