– వెంకన్నపై ఇన్ని కుట్రలు ఎందుకు?
(అన్వేష్)
ఈవోగా, చైర్మన్లుగా, కేవలం నీ బంధువులని మాత్రమే ఎందుకు పెట్టుకున్నావ్ ? దోపిడీ చేయటానికా ? స్వామి వారిని అపవిత్రం చేయటానికా ?
అన్ని రకాల సేవల ధరలు పెంచేశావ్. క్యూలైన్ లో ఇచ్చే పాలు, ప్రసాదాలు ఆపేశావ్ ? భక్తులని ఇబ్బంది పెట్టటానికా ? స్వామి వారికి భక్తులని దూరం చేయటానికా ?
లడ్డూ ధర రెట్టింపు చేశావ్, కానీ లడ్డూ నాణ్యత ఎందుకు పాడు చేశావ్ ? లడ్డూ పరిమాణం ఎందుకు తగ్గించావ్ ? భక్తులని ఇబ్బంది పెట్టటానికా ? స్వామి వారికి భక్తులని దూరం చేయటానికా ?
50 ఏళ్ళుగా తిరుమలకి నెయ్యి సప్లై చేస్తున్న, నందిని నెయ్యి ఎందుకు ఆపావ్ ? కమీషన్ కోసం ఆపావా ? స్వామి వారిని అపవిత్రం చేయటానికి చేశావా ?
టెండర్లన్నీ రద్దు చేసి రివర్స్ టెండర్ అని, కక్కుర్తి పడి, తక్కువ ధరకు నాసిరకం సరుకు ఇచ్చే వారిని ఎందుకు సెలెక్ట్ చేశావ్ ? కమీషన్ కోసం చేశావా ? స్వామి వారిని అపవిత్రం చేయటానికా ?
నెయ్యి సరఫరా చేయాలంటే మూడేళ్ల పాటు డైరీకి అనుభవం ఉండాలి.. ఆ నిబంధన మార్చి యేడాదికి ఎందుకు తగ్గించావ్ ? కమీషన్ కోసం చేశావా ? స్వామి వారిని అపవిత్రం చేయటానికా ?
4 లక్షల లీటర్లు ఉత్పత్తి చేసే డైరీకి అప్పగించాల్సి ఉన్న నిబంధనను మార్చి, ఎవరైనా సరఫరా చేయొచ్చు అని ఎందుకు మార్చావ్ ? కమీషన్ కోసం చేశావా ? స్వామి వారిని అపవిత్రం చేయటానికా?
నెయ్యి సప్లై చేసే కంపెనీ టర్నోవర్ రూ.250 కోట్లు ఉండాలని నిబంధన ఉంటే, దాన్ని రూ.150 కోట్లకు ఎందుకు తగ్గించావ్ ? కమీషన్ కోసం చేశావా ? స్వామి వారిని అపవిత్రం చేయటానికా ?
అసలు రూ.320 కేజీ స్వచ్చమైన ఆవు నెయ్యి ఎలా వస్తుంది ? ఎలా టెండర్ అప్రూవ్ చేశావ్ ? కమీషన్ కోసం చేశావా ? స్వామి వారిని అపవిత్రం చేయటానికి చేసావా ?
నీ పాపం పండి, నీ కుట్ర బయట పడింది. విచారణ జరుపుతాం అంటే, భయపడి, విచారణ అడ్డుకోవాలని కోర్టుకి ఎందుకు వెళ్ళావ్ ?