తినే కంచం లాగడమే మహాపాపం

Spread the love

టిప్ టాప్ గా రెడీ అయ్యి, ఏదన్నా పనిగా వెళ్లి, డబ్బులు లేకో, హోటల్ లేకో.. ఎంత ఆకలిగా వున్నా.. ఆ వీధిలో పెళ్లి గాని ఫంక్షన్ గానీ భారీ ఎత్తున జరుగుతుంటే.. ఆత్మాభిమానం చంపుకొని లోపలికి వెళ్లి తినరు. పస్తులైనా ఉంటారు గానీ. నామమాత్రం ధరకు అన్నం పెడుతున్నారు అంటే గర్వంగా వెళ్లి డబ్బు ఇచ్చి భోజనం చేస్తారు. ప్రసాదంలా భావించి ఆకలి తీర్చుకొంటారు.

పూర్వం ఋషులు యజ్ఞ యాగాలు చేస్తుంటే అందులో మాంసం కుమ్మరించే వారు రాక్షసులు అని పురాణాలలో చదువుకున్నాం. వారు కలియుగంలో ఎలా వుంటారో.. ఏ రూపాల్లో వుంటారో.. ఏమి చేస్తారో.. ఎంత దుర్మార్గానికి ఒడిగడుతారో.. ఎంత మహాపాపానికి పాల్పడతారో.. ఇటీవల ప్రజలు ఇలా అన్నం పెట్టే చోట్ల పెట్రేగే వైకాపాన్ల రూపంలో చూస్తున్నారు.

అన్నం తినే వాడిని బంతి నుండి లేపడం లేదా తినే కంచం లాగడమే మహాపాపం అంటారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని భావిస్తారు. అన్ని దానాలలోకి అన్నదానం గొప్పది అని మనసావాచా భావిస్తాం కాబట్టే.. పెళ్లి గానీ.. మరణం తరువాత పిండం పెట్టే శుభస్వీకరణ రోజు గానీ అన్నం పెడతాం అందరికీ. ప్రతి శుభకార్యంలో భోజనం పెడతాం. అది మన సంస్కృతి.

కానీ వికృత వైకాపా మూకలు ఇలా విరుచుకుపడడం వెనుక, అదీ స్వయంగా నాయుడు కుప్పం వెళ్లి మరీ, రావణకాష్టంకు వైకాపా తెగించడం వెనుక లోతుగా పరిశీలిస్తే.. వైకాపా తమ ప్రభుత్వం రద్దవ్వాలని గాఢంగా కోరుకొంటున్నట్లు అర్థం అవుతోంది. అందుకోసం కావాలని టిడిపి శ్రేణులను అల్లర్లు కావాలని రెచ్చగొట్టి మరీ.. ఎదురుగా హత్యాయత్నం & అట్రాసిటీ కేసులు పెడుతోంది చిత్తూరు జిల్లాలో.

బటన్ నొక్కడం ఇక జగన్ వలన కాదు. చేతులు ఎత్తేస్తే.. చేతగాని వాడుగా చరిత్రలో నిలిచిపోతాడు. ప్రభుత్వం రద్దైయితే.. తర్వాత వచ్చే ఎన్నికల్లో ఓడినా.. అన్యాయంగా దించేశారు అని ఏడ్చి రాజకీయం చేయవచ్చు. దిన దిన గండం ప్రపంచ దిగ్గజ దేశాల ఆర్థిక పతనాల ప్రస్తుత పరిస్థితుల్లో.. అందునా ప్రస్తుత ఆంధ్రా ఆర్థిక పరిస్థితులలో జగన్ రెడ్డికి ఏమీ పాలుబోవడం లేదు. చేతగాని చరిత్రహీనుడు అని అనిపించుకోవడం ఎవరికీ ఇష్టం వుండదు.

శాంతిభద్రతల సమస్యను అధికారంలో వున్న ఏ పార్టీ సృష్టించదు. కానీ వైకాపా తీవ్రతరం చేసినట్లుగా ఇటీవలి వరుస పరిణామాలు చూస్తుంటే అర్థం అవుతోంది. వారి ఉచ్చులో పడకుండా ప్రతిపక్ష టిడిపి.. సహనంగా ప్రజలకు తెలిసేలా.. ప్రతి దుర్మార్గాన్నీ తీసుకువెళుతోంది. కానీ వారి సహనానికి సరిహద్దు ఏందో వైకాపాకి అంతుబట్టడం లేదు. పరీక్షిస్తూనే వుంది. పాలన రద్దై జగన్ నెత్తిన పాలుపోయండని, ప్రతి పోగాళపనినీ బరితెగించి చేస్తోంది, వైకాపా.

పోలీసులకు వైకాపాన్లనే నిలువరించడం సాధ్యం కావడంలేదు. ఒక వేళ కుప్పంలో వుండే నాయుడు సైన్యం ఆయన కనుసైగ చేస్తే, కట్టుదాటి ముందుకు వస్తే.. ఆపడానికి కేంద్ర బలగాలు రావాల్సిందే. అయినా నాయుడు రోడ్డుపై కూర్చొని ప్రజాస్వామ్య బద్దంగా ఎంతో సహనంతో నిరసన తెలపడం, యావత్తు ఆంధ్రానూ ఆలోచింపజేస్తోంది.

ఈకాలంలో రాక్షసులు ఎలా వుంటారో కళ్లప్పగించి సమాజం చూస్తోంది. సర్వేజనా సుఖినోభవంతు. అన్నదాతా సుఖీభవ.

చాకిరేవు

Leave a Reply