దక్షిణ మధ్య రైల్వేల ద్వారా నడపబడుతున్న భారత్ గౌరవ్ రైళ్లు వేలాదిమంది రైలు వినియోగదారుల నుండి భారీ స్పందనను పొందుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుండి రైలు ప్రయాణీకులకు ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తు టూరిస్ట్ సర్క్యూట్ ట్రైన్‌గా ఆరంభమయిన ఈ రైలు, ఇప్పటి వరకు ఏడు ట్రిప్పులు పూర్తి చేసిన తదనంతరము ఈరోజు అనగా 12 , జులై 2023న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 8 వ భారత గౌరవ్ “పుణ్య క్షేత్రం యాత్ర ” రైలుగా ప్రారంభించబడింది.
ఈ రైల్ లో ఈ రోజు ప్రయాణం కొనసాగిస్తున ప్రయాణికురాలు సీనియర్ సిటిజన్ (66 సంవత్సరాలు) అయిన లక్ష్మి రాజయ్య 8 వ భారత్ గౌరవ్ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి జండా ఊపి ప్రారంభించారు. ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటిసీ) గ్రూప్ జనరల్ మేనేజర్ రాజ్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లోని రైలు ప్రయాణీకులకు దేశంలోని తూర్పు మరియు ఉత్తర భాగంలోని కొన్ని పురాతన మరియు చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించడానికి ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుంది. ఈ రైలు దేశంలోని తూర్పు మరియు ఉత్తర భాగంలోని ముఖ్యమైన యాత్ర మరియు చారిత్రక ప్రదేశాలను కవర్ చేస్తు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లోని రెండు తెలుగు రాష్ట్రాలలో ఏనిమిది ముఖ్యమైన స్టేషన్లలో ఎక్కే / దిగే సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ టూరిస్ట్ సర్క్యూట్ రైలు తెలంగాణలోని సికింద్రాబాద్ , కాజీపేట , ఖమ్మంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట్ , పెందుర్తి మరియు విజయనగరంలో కూడా ఎక్కే / దిగే సౌకర్యాన్ని అందిస్తుంది . ఈ రైలు 9 రోజుల వ్యవధిలో ఉత్తర భారతదేశంలోని పూరి , కోణార్క్ , గయ, వారణాసి, అయోధ్య , ప్రయాగ్‌రాజ్ వంటి దివ్య/తీర్థ స్థలాలను కవర్ చేస్తుంది .
ఈ రైలు అందించే అపూర్వ అవకాశం ద్వారా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మాత్రమే కాకుండా మార్గమద్యoలోని స్టేషన్ల నుండి కూడా ప్రయాణికులు ఈ రైలు ఎక్కేoదుకు ముందుకు వచ్చారు. ఈ రైలు అన్ని వర్గాల ఆదరణను ప్రతిబింబిస్తూ 2 ఏ సీ (1 కోచ్), 3 ఏ సీ (3 కోచ్‌లు) మరియు స్లీపర్ (7 కోచ్‌లు) కలిగిన మిశ్రమ కూర్పుతో ఏ సీ మరియు నాన్-ఏసీ ప్రయాణీకులకు అవకాశాన్ని అందిస్తుంది. సికింద్రాబాద్ స్టేషన్ నుండి వచ్చే ప్రయాణీకులుతో పాటు మార్గంలోని స్టేషన్ల నుండి కూడా చేరే రెండు వైపులా ప్రయాణీoచే రైలు ప్రయాణికులు ఏ సీ మరియు నాన్-ఎసి రైలు సేవలను పొందారు.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ గౌరవ్ టూరిస్ట్ రైలుకు ప్రయాణికుల నుండి గొప్ప స్పందన లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. యాత్రికులకు వ్యక్తిగత ప్రయాణ అంశాలను ప్లాన్ చేయడంలో ఇబ్బంది లేకుండా సాంస్కృతికంగా ప్రముఖ మరియు చారిత్రక ప్రదేశాలను సందర్శించడానికి రైలు గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత్ గౌరవ్ రైళ్లు దేశంలో ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి పెద్దపీట వేస్తాయని కూడా ఆయన పేర్కొన్నారు.
రైలు ప్రయాణీకులు, అదే పర్యటన ప్రారంభమయ్యే 9వ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు (పుణ్య క్షేత్ర యాత్ర – పూరి-కాశీ-అయోధ్య) జూలై 26, 2023 నుండి 3 ఆగస్టు, 2023 వరకు అందించే సేవలను ఉపయోగించుకోవచ్చును .
బుకింగ్‌లు తెరవబడి ఉంటాయి.
9వ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు (పుణ్య క్షేత్ర యాత్ర – పూరి-కాశీ-అయోధ్య)జూలై 26, 2023 నుండి 3 ఆగస్టు, 2023 వరకు
పుణ్య క్షేత్రం యాత్ర : పూరి-కాశీ-అయోధ్య
పర్యటన ప్రయాణం సికింద్రాబాద్ – పూరి – కోణార్క్ – గయ – వారణాసి – అయోధ్య – ప్రయాగ్‌రాజ్ – సికింద్రాబాద్
పర్యటన తేదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 12:00 గంటలకు బయలుదేరుతుంది
26.07.2023 నుండి 03.08.2023 వరకు
వ్యవధి 8 రాత్రులు/9 రోజులు
ఎక్కే / దిగే సౌకర్యాన్ని కలిగిన స్టేషన్లు సికింద్రాబాద్ , కాజీపేట , ఖమ్మం , విజయవాడ, ఏలూరు , రాజమండ్రి, సామర్లకోట , పెందుర్తి & విజయనగరం
ఒక్కొక్కరికి ధర (జీ ఎస్ టీ తో సహా) ఎకానమీ కేటగిరీ (స్లీపర్ ): రూ. 15075/-
ప్రామాణిక వర్గం (3ఏసీ): రూ. 23875/-
కంఫర్ట్ కేటగిరీ (2 ఏసీ): రూ. 31260/-
దయచేసి బుకింగ్‌ల కోసం IRCTC: http://www.irctctourism.com వెబ్‌సైట్‌ని సందర్శించండి
కౌంటర్ బుకింగ్ కోసం సంప్రదించండి:
సికింద్రాబాద్: 040-27702407, 9701360701, 8287932228, 8287932229, 9110712752, 9390112760
విజయవాడ: 8287932319, 821819
తిరుపతి: 8287932313, 8287932317
విశాఖపట్నం: 8287932318, 8287932225