తుఫాను ప్రభావిత ప్రాంతాలలో సహాయ చర్యల్లో పాల్గొనాలని బిజెపి శ్రేణులకు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపు
మిచౌంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని బిజెపి శ్రేణులు కు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల, జిల్లా ఆపై స్థాయి నాయకులు తో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ను పునరావాస కేంద్రాలకు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలన్నారు. తుఫాను వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు బిజెపి నేతలు అన్ని విధాలుగా అండగా నిలవాలన్నారు.
సహాయక చర్యల్లో బిజెపి శ్రేణులు విస్తృతంగా పాల్గొనాలన్నారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా సహాయ చర్యల్లో పాల్గొనాలని సూచించారు. విపత్తు ప్రభావం వల్ల జరిగే నష్టం అంచనాలను,ఇతర విషయాలు వెంటనే బిజెపి రాష్ట్ర కార్యాలయానికి తెలియచేయాలని టెలికాన్ఫరెన్స్ లో విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు బిజెపి రాష్ట్ర కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు.