ఏలిన నాటి శని నడుస్తున్న మకర, కుంభ,మీన రాశుల వారికి, అష్టమ శని నడుస్తున్న కర్కాటక రాశి, అర్ధాష్టమ శని నడుస్తున్న వృశ్చిక రాశుల వారు శని భగవానుడి అనుగ్రహం కొరకు అద్భుత అవకాశం
శనివారం ఉదయం 6నుంచి 9 గంటలలోపు నిర్వహించాలి.
ఉదయం స్నానం చేసిన అనంతరం సుమారు ‘ 20గ్రాముల గల్లుప్పు, 20గ్రాముల నల్ల నువ్వులు ‘ కలిపి రోటిలో
లేదా బండపై నూర్చాలి.
కొత్తది.. కొద్దిగా పెద్దది ప్రమిద తీసుకోవాలి..
పరిహారం పాటించేవారు కుటుంబ సభ్యులు ఒకరితో కలిసి జమ్మి చెట్టు వద్దకు వెళ్ళాలి.
శమీ (జమ్మి చెట్టు) వృక్షం వద్ద ప్రమిదలో
మీవద్ద వుప్పు, నువ్వుల పొడి వేసి, స్వచ్ఛమైన నువ్వుల నూనె పోసి 5 వత్తులు
వేసి వెలిగించాలి.
శని భగవానుడుని భక్తితో స్తుతిస్తూ జమ్మి చెట్టు చుట్టూ 19 ప్రదక్షిణలు చేయాలి.
పరిహారం అనంతరం కాళ్ళు కడుక్కోవడం నిషిద్దం
కేవలం పైన పేర్కొన్న 5 రాశుల వారు
మాత్రమే ఈ పరిహారం పాటించాలి.
మిగిలిన రాశుల వారు చేయకూడదు.
అంటు,పురుడు, మైల వున్నవారు, గర్భవతులు పరిహారానికి నిషిద్దం
పరిహారం పాటించే రోజు ఎర్ర దుస్తులు వేసుకో రాదు
పై రాశుల వారు ఈ పరిహారంతో పాటు
శని భగవానుడికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసి, 1250 గ్రాముల నువ్వులు దానం చేస్తే మరీ మంచిది.
సేకరణ
– శేషార్జున్ దారా