Suryaa.co.in

Andhra Pradesh Telangana

ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టండి: సాయిబాబా

అరాచకాలకు ఆలవాలంగా మారిన ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని తెలుగుదేశం సికింద్రాబాద్ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా డిమాండ్ చేశారు. మంగళగిరిలోని ఏపీ టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ కార్యకర్తల దాడికి నిరసనగా సికింద్రాబాద్ పార్టీ ఆఫీసు నుంచి మహాత్మాగాంధీ విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించిన టీడీపీ కార్యకర్తలు, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సాయిబాబా, వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల కిశోర్ మాట్లాడుతూ ఏపీలో అరాచకం రాజ్యమేలుతున్న నేపథ్యంలో, కేంద్రం మౌనాన్ని వీడి ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపాలని కోరారు. అన్ని పార్టీల కార్యాలయాలకు కేంద్ర భద్రత కల్పించాలన్నారు. ఏపీ డీజీపీ చట్టప్రకారం, ఆత్మసాక్షిగా పనిచేయడం మానేశారన్న విషయం, నిన్నటి ఘటన రుజవు చేసిందన్నారు. కేంద్రం స్పందించి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించకపోతే, ఆంధ్రాలో మనుషులు బతకడం కష్టమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పి.బాల్ రాజ్ గౌడ్, రాజా చౌదరి, అంబర్పేట incharge బిల్డర్ ప్రవీణ్, పి.రవీంద్ర చారి.వలరపు శ్రీనివాస్, C H విజయశ్రీ, అన్నపూర్ణ, అనంత రెడ్డి, ముంజ వెంకట్ రాజం. మ్ కే.బోస్, జోగెంద సింగ్. చంద్రా, య. ప్రసాద్ బాబాయ్ భాస్కర్,అనిల్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE