– బాబును గెలిపించామని ఉద్యోగులు బాధపడుతున్నారు
– ఎన్నికల ముందు జగన్ ఓటమికి కంకణం కట్టుకున్నారు
– నగరి వైఎస్ఆర్ కాంగ్రెస్ భవిష్యత్తు కార్యచరణ పై సమీక్షలో మాజీ మంత్రి రోజా
– జగన్ బరువు 78 కేజీ లైతే, తన గుండె కూడా 78 కేజీలే
ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి
తిరుపతి: ‘‘జైల్లో పెడతావా పెట్టుకో. ఉద్యోగాలు తీసేస్తావా తీసేసెయ్. మళ్లీ జగనన్న ప్రభుత్వం వస్తుంది. వడ్డీతో సహా చెల్లిస్తాం. కార్యకర్తలు నిరుత్సాహపడాల్సిన పనిలేదు. కూటమి ప్రజావ్యతిరేక విధానాలు తిప్పికొడుతూ మనం జనం పక్షఫాన నిలబడ దాం. మళ్లీ మనమే వస్తున్నాం. ప్రజలు మనల్నే కోరుకుంటున్నారు’’ అని మాజీ మంత్రి రోజా అన్నారు. తిరుపతిలో జరిగిన నగరి నియోజకవర్గ సమీక్ష సమావేశంలో ఆమె కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
మా గురువు కరుణాకర్ రెడ్డి అధ్యక్షత నగరి మరింత నూతన ఉత్తేజం కలిగిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం వల్ల ఓడిపోయాము. ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠ చూపారు. ఆరునెలలకే నరకం చూపిస్తున్నారు. రాష్ట్రంలో జగన్ ఓడిపోయినందుకు ప్రజలు బాధపడుతున్నారు.
జగన్ ఇచ్చిన ప్రతి హామీ నేరవేర్చిన జగన్ ఉన్నప్పుడు విధ్యదీవెన, రైతు రుణ మాఫి. సంపద సృష్టిస్తా అన్న చంద్రబాబు నేడు అప్పులపై అప్పులు చేస్తున్నారు. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ కావాలని నేడు బలంగా కోరుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం యువత, మహిళ, విద్యార్థులు మోసం చేసింది. పచ్చ డ్రెస్ వేసుకొని ఎన్నికల ముందు ఊదరగొట్టారు. నేడు నరకం చూపిస్తుంది కూటమి ప్రభుత్వం.
నాడు, నేడు ద్వారా స్కూల్స్ అద్భుతంగా మార్చారు. కానీ కూటమి ప్రభుత్వం వైన్ షాపులను అభివృద్ధి చేసింది. రాష్ట్రాన్ని మధ్యాంద్ర ప్రదేశ్ గా చేస్తుంది కూటమి ప్రభుత్వం. జగన్ ఓడించే వరకు ఉద్యోగులు కంకణం కట్టుకున్నారు, నేడు ఎందుకు చంద్రబాబును గెలిపించామా అంటు బాధపడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు గా భూమన కరుణాకర్ రెడ్డి అందరికి అండగా ఉన్నారు.
నియోజకవర్గం లో నేను, జిల్లాలో కరుణాకర్ రెడ్డి, రాష్ట్రంలో జగన్ మనకు అండగా ఉన్నారు. బిజినెస్ మెన్, ఫ్యామిలీ మెన్ గా, పొలిటికల్ మెన్ గా జగన్ విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం భయబ్రాంతులకు భయపడకండి, రాబోయేది జగన్ ప్రభుత్వం. ఇప్పుడు ఎవరైతే ఇబ్బందులు పెట్టారో, వారికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం.
విద్యుత్ బిల్లుపై రేపు నిరసన ఉంటుంది. జనవరి విద్యార్థులకు అండగా పోరాడాలి. పచ్చ చానల్స్ అబద్దాలు చెప్పడం ఇంకొటి ఉండదు. ప్రజల సమస్య, మహిళల సమస్య అందరికి తెలియచేయాలి.
కూటమి బెదిరింపులకు బెదిరేది లేదు: ఎంపీ గురుమూర్తి
కూటమి ప్రభుత్వం వచ్చాక లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. కూటమి బెదిరింపులకు బెదిరేది లేదు. జగన్ కోసం పోరాడే వారికి సముచిత స్థానం, ప్రాధాన్యత ఉంటుంది. .మనమందరు ఒకరి ఒకరు తోడు కావాలి. ఏ ఒక్కరికి కష్టం వచ్చిన, కరుణాకర్ రెడ్డి అండగా మేము అండగా ఉంటాము.
జగన్ విసిరిన ఫిరంగి రోజా: కరుణాకర్ రెడ్డి
తెలుగుదేశం, కూటమి ప్రభుత్వానికి జగన్ విసిరిన ఫిరంగి రోజా. జగన్ నాయకత్వం పార్టీని పూర్వవైభవాన్ని తీసుకురావడానికి నేడు మొదటి సర్వసభ్య సమావేశం. రోజా నగరికి రాజా లాంటిది. రోజా కొమ్మకే కాదు, పువ్వులు కూడా ముళ్లు ఉంటాయి. ప్రజాదరణ ఉన్న నాయకురాలు.
జగన్ మనసులో చెల్లిగా స్థిరపడ్డారు రోజా. రోజా ని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన భాద్యతలు మీ పై ఉంది. నగరి అభివృద్ధి చేసింది, అందుకే రోజాని గెలిపించాలని కోరుతున్నాను. నగరి లో రోజాని బలోపేతం చేయాలని నన్ను ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడుగా చేశారు.
ప్రపంచంలో ఎక్కడ జగన్ లాంటి వారు ఉండరు, అంతటి గొప్ప వ్యక్తి. జగన్ బరువు 78 కేజిలైతే, తన గుండె కూడా 78 కేజీలే. ఎవరో పనికిమాలిన వారి కింద పని చేయడం కంటే, ఉద్యమాల నుండి పుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉండటం మేలు. ఏ ఒక్క కార్యకర్తలో చిన్న భయం ఉన్న తొలగించుకోండి. కూటమి, తెలుగుదేశం పార్టీకి ఇక మనుగడ లేదు.
రోజా అంటే నిప్పుల కొలిమి, రోజా అంటే వెలిగే సూర్యుడు. బాధ ఉండచ్చు. కానీ వంగి ఉండాల్సిన అవసరం లేదు.