-5 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 22 పార్లమెంట్ల పరిధిలో భారీ బహిరంగ సభలు
-ప్రతి సభకు లక్షలాదిగా జనం తరలివచ్చేలా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం
• టీడీపీ-జనసేన సంయక్తంగా నిర్వహించే ఈ సభలకు చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరవుతారు
• 3వ తేదీన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయం సమీపంలోని కన్వెన్సన్ సెంటర్లో రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం సమావేశం నిర్వహించబోతున్నాం
• 4వ తేదీన పార్టీ జాతీయ కార్యాలయంలో చంద్రబాబు చేతులమీదుగా ‘జయహో బీసీ’ ప్రారంభం
• బీసీల్ని ఈ ప్రభుత్వం, జగన్ రెడ్డి ఎంత దారుణంగా వంచించారో, ఎంతగా వారిపై దమనకాండ సాగిస్తున్నారో ప్రతి బీసీ కుటుంబానికి తెలియచేసి బలహీనవర్గాల్లో చైతన్యమే లక్ష్యంగా టీడీపీ కార్యక్రమం
• టీ.ఎన్.టీ.యూ.సీ విభాగం ఆధ్వర్యంలోకార్మికుల్లో చైతన్యం తీసుకురావడమే ధ్యేయంగా త్వరలో రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర
• వైసీపీ అభ్యర్థుల కొత్త జాబితా ప్రకటిస్తానన్న జగన్ రెడ్డి, సొంత పార్టీలోని అసమ్మతులు, అసంతృప్తులకు భయపడి పిల్లిలా వెనకడుగు వేశాడు
• జగన్ రెడ్డిని సొంత పార్టీ నేతలే విశ్వసించడం లేదు
• టీడీపీలో చేరడానికి చాలామంది వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నార
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
విలేకరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు పాల్గొన్నారు.
గత 56 నెలల నుంచీ విధ్వంసకర పాలన సాగిస్తున్న జగన్ రెడ్డి అవినీతిపరు లు, అసమర్థులు, నేరస్తుల్ని పెంచి పోషిస్తున్నాడని, వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఎటు చూసినా విధ్వంసాలు, విద్వేషాలు, వైఫల్యాలు తప్ప, భూతద్దంలో వెతికినా కూడా ఎక్కడా ఒక మంచిపని కానీ, విజయం కానీ కనిపించవని, భస్మాసురుడి లా జగన్ రెడ్డి మొత్తం రాష్ట్రాన్నే విధ్వంసం చేశాడని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన పార్టీ సీనియర్ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
“ జగన్ రెడ్డి పాలనలో ఏ వర్గానికి రక్షణ లేదు. సగభాగమున్న మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అధికారాన్ని బాధ్యతగా భావించి, ప్రజలకు రక్షణగా ఉండి వారి క్షేమం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేయాల్సిన ముఖ్యమంత్రే, ఏపీ ని అంధకారంలోకి నెట్టేశాడు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే గ్రామపంచాయ తీలు, స్థానిక సంస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేశాడు. పంచాయతీల అభివృద్ధికి పైసా నిధులు ఇవ్వని జగన్ రెడ్డి, ఆఖరికి కేంద్రప్రభుత్వం ఇచ్చిన నిధులు రూ.9వేల కోట్లను దారిమళ్లించాడు.
జగన్ నిర్వాకంతో గ్రామాల్లో ఎక్కడా మచ్చుకైనా కూడా అభివృద్ధి లేకుండా పోయింది. ఆఖరికి మురుగుకాల్వలు బాగుచేయడానికి కూడా పంచాయతీల ఖాతాల్లో పైసాసొమ్ము లేకుండా చేశాడు. చంద్రబాబు హాయాంలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి తప్ప, ఈ నాలుగున్నరేళ్లలో ఎక్కడా ఎలాంటి మంచిపని జరగలేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు తీసుకున్న అనేక నిర్ణయాలు గతంలో దేశవ్యాప్తంగా అమలయ్యాయి… ప్రము ఖుల ప్రశంశలు అందుకున్నాయి.
ప్రజా చైతన్యమే లక్ష్యంగా రాబోయే 100 రోజుల్లో నిర్విరామంగా టీడీపీ కార్యక్రమాలు
2019లో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్ ను ఆందోళనాంధ్రప్రదేశ్ గా మార్చాడు. 22 రోజు లకు పైగా అంగన్ వాడీ సిబ్బంది నిరవధిక సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రిలో చలనంలేదు. సర్వశిక్షా అభియాన్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, ఆశావర్కర్లు అందరూ జగన్ రెడ్డిని నమ్మి మోసపోయామని, తమకు న్యాయం చేయాలని రోడ్లెక్కారు. ఈ ప్రభుత్వం కథ ముగిసింది. 100రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు రానున్నాయి. చివరిదశకు చేరిన జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనకు ముగింపు పలకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ 100రోజుల్లో ఈ ప్రభుత్వం, జగన్ రెడ్డి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిలో చైతన్యం తీసుకురావడానికి టీడీపీ నిర్విరామంగా కార్యక్రమాలు చేపట్టనుంది.
రాష్ట్ర పంచాయతీ రాజ్ వ్యవస్థ నిర్వీర్యంపై నేడు టీడీపీ ఆధ్వర్యంలో వర్క్ షాప్
టీడీపీ చేపట్టబోయే కార్యక్రమాల్లో ముందుగా 3వ తేదీన (బుధవారం) మంగళగిరి లోని పార్టీ జాతీయ కార్యాలయం సమీపంలోని కన్వెన్షన్ సెంటర్లో పంచాయతీ రాజ్ వర్క్ షాపు నిర్వహించబోతున్నాం. రాష్ట్రంలోని అన్ని గ్రామాల పంచాయతీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు ఆహ్వానం పంపించాం. వారందరి సమక్షంలో ఈ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను ఏవిధంగా నిర్వీర్యం చేసిందో, జగన్ రెడ్డి ఏ విధంగా పల్లెల్ని నాశనంచేస్తాడో తెలియచేస్తాం. తాము చెప్పే అంశాలను స్థానిక ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రజలకు తెలియచే స్తే, ఈ ప్రభుత్వానికి కాలం చెల్లినట్టే. అలానే టీడీపీ ప్రభుత్వ రాగానే పంచాయతీల బలోపేతానికి, పునర్వైభవానికి ఎలాంటి చర్యలు తీసుకుంటామో, ఏ విధమైన కార్యాచరణ అమలుచేస్తామో కూడా ఈ వర్క్ షాపులో తెలియచేస్తాము.
ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం బీసీసమాజంపై సాగిస్తున్న దమనకాండ ప్రతి బీసీ కుటుంబానికి తెలియచేయడానికే ‘జయహో బీసీ’
బీసీల గురించి జగన్ రెడ్డి గొప్పగా మాట్లాడుతున్నాడు. కానీ తన పాలనలో బీసీ లను దారుణంగా వంచించాడు. వారిపై తప్పుడు కేసులు పెట్టి, చిత్రహింసలకు గురిచేయించాడు. తన దుర్మార్గాలు ప్రశ్నించిన బీసీలను దారుణంగా చంపించా డు. 4 సంవత్సరాల 7 నెలలుగా ఈ ముఖ్యమంత్రి బీసీలపై దమనకాండ సాగిస్తున్నాడు. బీసీలుగా పుట్టడమే తప్పు అన్నట్టు వారిపై తన పైశాచికత్వం ప్రదర్శిస్తున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లకు 10శాతం కోత పెట్టాడు. 16వేలకు పైగా పదవుల్ని బీసీలకు దక్కకుండా చేశాడు. ఉత్తుత్తి కార్పొ రేషన్లు పెట్టి బీసీలను ఉద్ధరిస్తున్నట్టు కల్లబొల్లి మాటలు చెబుతున్నాడు.
బీసీ మంత్రుల్ని ఉత్సవవిగ్రహాల కంటే దారుణంగా తయారుచేశాడు. బీసీలపై ఈ ము ఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండను ప్రతి బీసీసోదరుడు/సోదరికి అర్థమయ్యేలా తెలియచేయడానికి టీడీపీ ఆధ్వర్యంలో ‘జయహో బీసీ’ కార్యక్రమాన్ని 4వ తేదీన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రారంభించబోతున్నారు. 4వ తేదీ నుంచి ప్రతి నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో కార్యక్రమం జరుగుతుంది. అలానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి బీసీ ఇంటి తలుపు తట్టేలా ‘జయహో బీసీ’ దిగ్విజయంగా కొనసాగు తుంది.
5వ తేదీ నుంచి ప్రజల్లోకి చంద్రబాబు
5వ తేదీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజల్లోకి వెళ్లనున్నారు. ప్రజా చైతన్యమే లక్ష్యంగా ఆయన పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. దానిలో భాగంగా 5వ తేదీన ‘రా..కదలిరా’ పేరుతో కొత్త కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లనున్నా రు. 5వ తేదీన ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో తొలి సభ జరగనుంది. 5వ తేదీ నుంచి 29వ తేదీవరకు 22 పార్లమెంట్ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నాం. రోజుకి 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరిగే సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. ప్రతిసభకు లక్షలాది ప్రజలు తరలివచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారని, తమ నియోజకవర్గాల్లో సభలు పెట్టాలని పలువురు నేతలు కోరుతున్నా, సమయా భావం వల్ల కొన్నిప్రాంతాలకే పరిమితమయ్యాం.
సభలకు తరలివచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయనున్నాం. 1982లో టీడీపీ ఆవిర్భవించక ముందు ఉన్న పరిస్థితుల కంటే దారుణమైన పరిస్థితులు నేడు రాష్ట్రంలో చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్ని చక్కదిద్దాలంటే, మరలా రాష్ట్రానికి కొత్త ఊపిరిరావాలంటే, చంద్రబాబునాయుడి నాయకత్వంతోనే సాధ్యమని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. కర్షకులు, కార్మికులు, మహిళలు, యువత, చిన్నారు లు, వృద్ధులు, శ్రామికులు ఇలా అందరూ ఆనందంగా బతకాలంటే అది చంద్రబాబు నాయకత్వం వల్లే సాధ్యమని నమ్ముతున్నారు. రాష్ట్రానికి స్వర్ణయుగం టీడీపీతోనే సాధ్యం. ఏపీ ఒక నూతన నవోదయం చూసేందుకు టీడీపీ-జనసేన పార్టీలు కలిసి ముందుకు సాగుతున్నాయి. రెండుపార్టీల కలయి కను, అవి నిర్వహించే కార్యక్రమాలను ప్రజలు అమితంగా ఆదరిస్తున్నారు.
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా భారీ బహిరంగ సభల వివరాలు…
5వ తేదీన : ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరిలో..
6వ తేదీన : విజయవాడ పార్లమెంట్ పరిధిలోని తిరువూరు, నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ఆచంట.
9వ తేదీన : తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వెంకటగిరి, నంద్యాల పార్లమెంట్ పరిధిలోని ఆళ్లగడ్డ.
10వ తేదీన : విజయనగరం పార్లమెంట్ పరిధిలోని బొబ్బిలిలో, కాకినాడ పార్లమెంట్ పరిధిలోని తుని.
18వ తేదీన : తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి వర్థంతిని మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని గుడివాడ లో భారీస్థాయిలో సభ నిర్వహించనున్నాం
19వ తేదీన : చిత్తూరు పార్లెమంట్ పరిధిలోని జీడీ నెల్లూరు, కడప పార్లమెంట్ పరిధిలోని కమలాపురం
20వ తేదీన : అరకు పార్లమెంట్ పరిధిలోని అరకులో, అమలాపురం పార్లమెంట్ పరిధిలోని మండపేట.
24న : రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు, అనంతపురం పార్లమెంట్ పరిధిలోని ఉవరకొండ.
25న : నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కొవ్వూరు, కర్నూలు పార్లమెంట్ పరిధిలోని పత్తికొండ అసెంబ్లీలో.
27న : రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలోని గోపాలపురం, గుంటూరు పార్లమెంట్ లోని పొన్నూరు అసెంబ్లీలో.
28న : అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని మాడుగుల, శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని టెక్కలిలో..
29 వ తేదీన : ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఉంగుటూరు, బాపట్ల పార్లమెంట్ చీరాల నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నాం. టీడీపీ – జనసేన కలిసే సభల్ని నిర్వహిస్తున్నాయి. చంద్రబాబుతో పాటు, పవన్ కల్యాణ్ కూడా కొన్ని సభలకు హాజరవుతారు.
టీడీపీ చేపట్టబోయే కార్యక్రమాలు, చంద్రబాబునాయుడి సభలకు భారీగా తరలి వచ్చి వాటిని విజయవంతం చేయాలని ప్రజల్ని కోరుతున్నాం.
టీడీపీలో చేరికలకు సంబంధించి రెండు కమిటీలు వేశాం…
తెలుగుదేశంలో చేరడానికి చాలామంది అధికారపార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారు. కానీ తామే ఆచితూచి వ్యవహరిస్తున్నాం. పార్టీలో చేరికలకు సంబంధించి రెండు కమిటీలు వేశాం. కమిటీల అభిప్రాయాలు, అధినాయకుడి నిర్ణయమే అంతిమం. పార్టీ నేతలతో సంప్రదించాకే కొత్తవారి చేరికపై స్పష్టమైన నిర్ణయానికి వస్తాం. ఒక వారంలో తెలుగుదేశంలో చేరేఇతర పార్టీలనేతలపై ఒక స్పష్టత వస్తుంది. సొంత పార్టీ నాయకులకే ఈ ముఖ్య మంత్రిపై విశ్వాసం లేదు. ఈ రోజో, రేపో తనపార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తున్నానన్నాడు.. మరలా పిల్లిలా వెనకడుగు వేశాడు. ప్రసారమాధ్యమాల్లో వచ్చిన కథనాలకు భయపడినట్టున్నాడు.
టీ.ఎన్.టీ.యూ.సీ బస్సుయాత్ర
టీ.ఎన్.టీ.యూ.సీ విభాగం తర్వలోనే బస్సుయాత్ర చేపట్టనుంది. దానికి సంబంధించిన పోస్టర్ ను ఇప్పుడు ఆవిష్కరిస్తున్నాం. టీ.ఎన్.టీ.యూ.సీ నేతలు అన్నిరంగాల కార్మికులతో మాట్లాడి, టీడీపీ ప్రభుత్వంలో కార్మికులకు జరిగిన మేలు..ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి చేసిన మోసాల్ని వివరిస్తారు.” అని అచ్చెన్నాయుడు తెలిపారు.