Suryaa.co.in

Telangana

రాహుల్ గాంధీకి పిచ్చిపట్టినట్లుంది

-అణగారిన వర్గాల పై కాంగ్రెస్ అహంకారానికి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు నిదర్శనం
-రాహుల్ గాంధీ కాంగ్రెస్ కు పట్టిన శని
-బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీమంత్రి డీకే అరుణ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పిచ్చిపట్టినట్లుంది. ఆయన ఏం మాట్లాడుతున్నరో ఆయనకే అర్ధం కావట్లేదు…మోదీ అనే పేరున్న వాళ్లంతా దొంగలే అని సంబోధిస్తారు. హిండెన్ బర్డ్ విషయంలో అదానీకి అనుకూలంగా తీర్పు రాబోతోందని జడ్జిల కమిటీని అవహేళన చేస్తూ న్యాయ వ్యవస్థనే కించపరుస్తున్నారు. లండన్ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారత్ పరువు తీశారంటూ దేశ ప్రతిష్టను మంట కలపారు. రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నాం.

‘‘దొంగల ఇంటి పేరు మోదీ’’ అంటూ చేసిన తప్పుడు వ్యాఖ్యల ఫలితంగానే రాహుల్ గాంధీకి రెండేళ్ల పాటు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పునిస్తే బీజేపీకి సంబంధమేంటి? కోర్టు తీర్పుకు, బీజేపీకి లంకె పెడుతూ కాంగ్రెస్ గాయి గాయి చేయడం సిగ్గు చేటు.

ఇప్పటికైనా దేశ అణగారిన వర్గాల పై కాంగ్రెస్ అహంకారానికి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు నిదర్శనం.. రాహుల్ గాంధీ కాంగ్రెస్ కు పట్టిన శని. ఆయన ఉన్నంత కాలం పార్టీ బాగుపడదని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. తక్షణమే రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రెండేళ్లపాటు శిక్ష పడినందున పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగడానికి ఆయన అనర్హుడు. ఈ దిశగా పార్లమెంట్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

LEAVE A RESPONSE