రేపు బీజేపీ ‘‘నిరుద్యోగ మహాధర్నా’’

2

-భారీ ఎత్తున ఏర్పాట్లకు సిద్ధమైన బీజేపీ
-స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమైన నిరుద్యోగులు, విద్యార్థులు
-వర్శిటీలు, లైబ్రరీలుసహా ఎక్కడ చూసినా నిరుద్యోగుల్లో పేపర్ లీకేజీ, BJP ధర్నాపైనే చర్చ
-బీజేపీ మహాధర్నాకు సంఘీభావం తెలిపేందుకు సిద్ధమైన ప్రజా, యువజన సంఘాలు
-ధర్నా చౌక్ వద్ద ధర్నాకు అనుమతి ఇవ్వని కేసీఆర్ సర్కార్
-సర్కార్ తీరుపై మండిపడుతున్న బీజేపీ నేతలు
-ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుద్యోగ మహాధర్నా నిర్వహించి తీరుతామని ప్రకటించిన బండి సంజయ్
-నిరుద్యోగుల పక్షాన అనుమతి కోసం కోర్టు మెట్లెక్కిన వెళ్లిన బీజేపీ నేతలు

భారతీయ జనతా పార్టీ మరో ఉద్యమానికి సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరీక్షల పేపర్ లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్ అంధకారంలో పడిన నేపథ్యంలో వారి తరపున పోరాడేందుకు బీజేపీ సన్నద్దమైంది. అందులో భాగంగా ఇటీవల పార్టీ కార్యాలయంలో దీక్ష నిర్వహించిన బండి సంజయ్ కుమార్… రేపు ఇందిరా పార్క్ వద్ద వేలాది మందితో ‘‘మా కొలువులు మాగ్గావాలే‘‘ నినాదంతో నిరుద్యోగ మహాధర్నా చేయబోతున్నారు. ఈ మహాధర్నాకు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులు, ఉద్యోగులు, మహిళలు, నిరుద్యోగులుసహా అనేక ప్రజా సమస్యలపై బండి సంజయ్ కుమార్ అలుపెరగకుండా చేస్తున్న పోరాటాలు యావత్ రాష్ట్రం ద్రుష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపు ఇందిరా పార్క్ వద్ద జరప తలపెట్టిన ‘‘నిరుద్యోగ ధర్నా’’ ఆసక్తికరంగా మారింది.

మరోవైపు బండి సంజయ్, బీజేపీ నేతలు చేస్తున్న పోరాటాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందిగా పరిణమించడంతోపాటు ముఖ్యంగా అధికార పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందనే భావనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొంతకాలంగా బీజేపీ నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలకు అనుమతివ్వడం లేదు. 3, 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రలు మొదలుకుని రైతు దీక్ష, 317 జీవోను నిరసిస్తూ చేపట్టిన దీక్షతోపాటు అనేక ఆందోళన కార్యక్రమాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ వెనక్కు తగ్గని బీజేపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించి అనుమతి తీసుకుని ఆయా కార్యక్రమాలను నిర్వహించి విజయవంతం చేశారు. అయితే రేపు జరపతలపెట్టిన నిరుద్యోగ దీక్షకు సైతం ప్రభుత్వం అనుమతివ్వకపోవడంతో… చివరి నిమిషంలో హైకోర్టు అనుమతి ఇచ్చినా… సరైన ఏర్పాట్లు చేసుకునేందుకు బీజేపీ నేతలకు తగిన సమయం ఉండే అవకాశం లేనందున నిరుద్యోగ మహాధర్నా ఏర్పాట్లు చేసుకోవడంలో విఫలమవుతారని, తద్వారా మహాధర్నా విజయవంతం కాదనే భావనలో అధికార పార్టీ నేతలున్నారు.

అయితే నిరుద్యోగ మహాధర్నా బీజేపీకే పరిమితమైన కార్యక్రమం కాదని, 30 లక్షల మంది నిరుద్యోగులు, వారి కుటుంబాల భవిష్యత్ కు ముడిపడి ఉన్న సమస్యపై చేస్తున్న ధర్నా అనే విషయాన్ని మర్చిపోవద్దని చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీ ధర్నాలో పాల్గొంటామని పెద్ద ఎత్తున నిరుద్యోగులు, విద్యార్థులు మీడియా, సోషల్ మీడియా వేదికగా బాహాటంగానే చెబుతున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ‘‘ఈనెల 25న ఇందిరాపార్క్ వద్ద బీజేపీ చేపట్టిన ‘‘నిరుద్యోగ మహాధర్నా’’కు నేను వెళుతున్నా… మీరు రండి’’ అంటూ పెద్ద ఎత్తున నిరుద్యోగులు, విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న విషయాన్ని ఆ నేతలు ప్రస్తావిస్తున్నారు. ధర్నా చౌక్ వద్ద చేపట్టిన నిరుద్యోగ మహా ధర్నాకు అనుమతి ఇవ్వకపోవడాన్ని బీజేపీతోపాటు ప్రజాస్వామ్యవాదులు, యువకులు, విద్యార్థులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన తెలపడం, ప్రజా సమస్యలపై ఆందోళన చేయడం రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కు. నిరసన తెలిపేందుకే ఇందిరా పార్క్ ను ధర్నా చౌక్ గా మార్చారు. దీనివల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగే ఆస్కారమూ లేదు.

అయినప్పటికీ ధర్నా చౌక్ వద్ద బీజేపీ ధర్నాకు అనుమతి ఇవ్వకపోవడమంటే రాజ్యాంగాన్ని ఉల్లఘించడమే, పౌరుల ప్రజాస్వామిక హక్కును కాలరాయడమేనని ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు. లైబ్రరీలు, యూనివర్శిటీలు సహా నిరుద్యోగులు ఏ ఇద్దరు కలిసినా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపైనే చర్చించుకంటూ సర్కార్ తీరును తప్పుపడుతుండటం, బీజేపీ ధర్నాలో పాల్గొంటామని చెబుతుండటం గమనార్హం. ఏ రాష్ట్రానికైనా చదువు, పరీక్షలు, ఉద్యోగాల భర్తీ అత్యంత ముఖ్యం. కేసీఆర్ సర్కార్ మాత్రం వీటిని పూర్తిగా నిర్వీర్యం చేసింది. 2016లో ఎంసెట్ పేపర్ లీక్…. ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకంలో తప్పిదాలు, టెన్త్ ప్రశ్నాపత్రాల తప్పుల తడకతో పరీక్షల వాయిదా, జేఎన్టీయూ ప్రశ్నా పత్రాల తాజాగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వంటి అంశాలు కేసీఆర్ ప్రభుత్వానికి సర్వసాధారణమయ్యాయని నిరుద్యోగులు మండిపడుతున్నారు. పేపర్ లీకేజీ సర్వసాధారణమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పడాన్ని బట్టి చూస్తే పరీక్షలు, పేపర్ లీకేజీ అంటే ఎంత చులకనో అర్ధం చేసుకోవచ్చని గుర్తు చేస్తున్నారు.

‘‘టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశం తెలంగాణ సమాజాన్ని, యువత భవిష్యత్ ను ప్రమాదంలోకి నెట్టేసే అంశం. కేటీఆర్ ఇద్దరు చిన్న ఉద్యోగులకు పరిమితం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. డబ్బుల దగ్గర గొడవ రాకపోతే పేపర్ లీకేజీ అంశమే బయటకు వచ్చేది కాదు.. ఏటా అర్హులైన నిరుద్యోగులంతా నష్టపోతూనే ఉండేవారు. ఇది ఒక్క టీఎస్పీఎస్సీకే పరిమితమని అనుకోవడం లేదు… సింగరేణి, ప్రభావితం చేసే అంలో రిజిస్టర్ చేసుకున్నవాళ్లు 30 లక్షల మంది ఉన్నారు… వాళ్ల భవిష్యత్ అంధకారం… ఇది చాలా పెద్ద సబ్జెక్ట్… ఇద్దరికే పరిమితం చేస్తూ చేతులు దులుపుకోవడం సరికాదు.. డబ్బుల తగాదా రాకపోతే విషయం బయటకు పొక్కేది కాదు.. నిజమైన అర్హులు నష్టపోయేవారు.. అందుకే ఈ అంశాన్ని బీజేపీ అత్యంత సీరియస్ గా తీసుకుంది. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే వరకు, బాధ్యుడైన మంత్రి కేటీఆర్ ను కేబినెట్ నుండి బర్తరఫ్ చేసే వరకు, నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం అందించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. ఈ విషయంల్ ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు పెట్టినా, అనుమతి ఇవ్వకపోయినా ఆగే ప్రసక్తే లేదని, నిరుద్యోగ మహా ధర్నా నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు.