విదేశాల్లో భారత్ పరువు తీసే ఘనుడు రాహుల్ గాంధీ

1

– కోర్టు తీర్పుకు, బీజేపీకి లంకె పెడుతూ కాంగ్రెస్ గాయి గాయి చేయడం సిగ్గు చేటు
– బీజేపీ సీనియర్ నేత, తమిళనాడు సహా ఇంఛార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి

‘‘దొంగల ఇంటి పేరు మోదీ’’ అంటూ చేసిన తప్పుడు వ్యాఖ్యల ఫలితంగానే రాహుల్ గాంధీకి రెండేళ్ల పాటు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పునిస్తే దానిని బీజేపీకి అంటగట్టడం అన్యాయం. కోర్టు తీర్పుకు, బీజేపీకి లంకె పెడుతూ కాంగ్రెస్ గాయి గాయి చేయడం సిగ్గు చేటు.

విదేశాల్లో భారత్ పరువు తీసే ఘనుడు రాహుల్ గాంధీ. భారత దేశ సంపదను కొల్ల గొట్టింది కాంగ్రెస్ హయాంలోనే. దేశ రాజకీయాల్లో పరిపక్వత లేని నాయకుడు రాహుల్ గాంధీ. జనాదరణ లేకనే రాహుల్ అమేథీలో ప్రజలు తిరస్కరించారు.

ప్రపంచమే మోడీ ని కొనియాడుతుంటే దేశంలోని ప్రతిపక్షాలు పసలేని విమర్శలు చేయడం సిగ్గు చేటు. ఇకనైనా చేసిన తప్పును రాహుల్ గాంధీ సరిదిద్దుకోవాలి. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో దేశ వ్యాప్తంగా ఉద్యమిస్తం.