Suryaa.co.in

International

దుబాయ్‌లో వర్ష బీభత్సం

వర్ష బీభత్సానికి దుబాయ్‌ విలవిలలాడిపోతోంది. కేవలం గంటన్నర వ్యవధిలో అంటే 90 నిమిషాల్లో.. ఏడాదిలో కురవాల్సిన వర్షమంతా ఒకేసారి కురిసింది. మాల్స్ అన్నీ నీటితో నిండిపోయాయి. దుబాయ్ ఎయిర్ పోర్టులోనూ వర్ష బీభత్సం ప్రత్యక్షంగా కనిపించింది. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బయటి రోడ్లను చూస్తే అవి చెరువులను తలపించాయి. సబ్ వేలన్నీ నీట మునిగాయి. రోడ్లపై నిలిపివుంచిన కార్లు నీటిలో కొట్టుకుపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ అయిన మాల్‌ ఆఫ్ ఎమిరేట్స్ లోపలికి నీరు ప్రవేశించింది. గత 75 ఏళ్లలో ఎప్పుడూ ఇంతటి భారీ వర్షాలు కురియలేదని అధికారులు వెల్లడించారు.

LEAVE A RESPONSE