టీవీ9 కేసులు పెట్టే పరిస్థితికి దిగజారిందా!?
మేము కేసులు పెట్టడం మొదలు పెడితే.. వాయిదాలకి హాజరు కావడానికి మీ జీవితకాలం సరిపోదు
రాజేష్ కి అండగా టిడిపి కుటుంబం ఉంటుంది
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
అయ్యో.. ఒకప్పుడు టీవీ9 పైన కేసులు పెట్టే వారు. ఇప్పుడు టీవీ9 కేసులు పెట్టే పరిస్థితికి దిగజారిందా!? మెరుగైన సమాజం కోసం అంటూనే ప్యాకేజీల కోసం ప్రతిపక్షాలపై మొరుగుతున్న టివి9 ని ఎండగట్టారు టిడిపి అధికార ప్రతినిధి రాజేష్ మహాసేన. దానికే కేసులు పెడితే మీరు చేస్తున్న విషప్రచారంపై మేము కేసులు పెట్టడం మొదలు పెడితే.. వాయిదాలకి హాజరు కావడానికి మీ జీవితకాలం సరిపోదు.
ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి… మీ చీకటి బతుకులు ఎండగడుతూనే ఉంటాం. రాజేష్ కి అండగా టిడిపి కుటుంబం ఉంటుంది.
అక్కడ జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకు గతంలో టీవీ9లో పని చేసి మానేసిన ఉద్యోగులపై కేసులు పెట్టారు..ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల నేతలపై కేసులు పెడుతున్నారు.. పాపం పండే దశకు వచ్చింది..మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.