ఒక అంకం ముగిసింది..
వేడి తగ్గింది..
న్యాయం గెలిచింది
న్యాయస్థానం స్పందించింది
సరే..
కథ ముగిసిందా..
తీర్పును పొగిడేస్తున్నారు..
బాగానే ఉంది..
ఇదేనా పరిష్కారం..
ప్రతి కథకు..ప్రతి వ్యధకు ఇలాగానే ముగింపు..
అన్ని కథలూ
ఒకేలా ఉండవుగా..
ప్రతిచోటా కోర్టు నుంచి..
పోలీసు నుంచి
ఇలాంటి స్పందనే రాదుగా..!
జనం ఆహా..ఓహో అంటున్నారు..
పొంగిపోతున్నారు..
తీర్పు సూపరంటున్నారు..
ఫార్వార్డులు దంచేస్తున్నారు
నిన్నటి అవేశం నేడు లేదు..
రేపటికి అసలే ఉండదు..
ఎవరి పని వారిదే..
ఉద్యోగాలు..వ్యాపారాలు..
వాట్సాప్పులు..
కోర్టులకు హేట్సాప్పులు..
రేపు మరో రేపు..
ఎల్లుండి ఇంకో సజీవదహనం..
అప్పుడు ఇంతలా స్పందించమే..
నిన్ననే కదా చూసాం..మళ్లీనా..
రోజూ జరిగేదే కదా..
అదోలాంటి నిర్లిప్తత..నిరాసక్తత..!
అందుకే..అందుకే..
కావాలి..రావాలి మార్పు..
ప్రతి కేసులోనూ
ఇలాంటి తీర్పు!
ప్రతి మనిషి ఆలోచనలో..ప్రవర్తనలో..
మగవారైనా.. ఆడవారైనా..
వ్యక్తిగత పరివర్తన..
స్వీయనియంత్రణ..
సంస్కరణ..
ఆపై కోర్టులు..చట్టాలు..
వాటిని నడిపే పెద్దలు..
శిక్షలపై..కోర్టుల సాగదీత వైనాలపై..
కొన్ని ఉదంతాలలో
అందుతున్న వాయనాలపై..
ఫాయిదా లేని వాయిదాలపై..!?
ఏం చేయాలి..
ఎలా ఆపాలి..
ఇవి అసలు ప్రశ్నలు..
చాలాకాలంగా
సమాధానం దొరకనివి..
పడవ ప్రమాదం జరిగినప్పుడు ఎప్పటికప్పుడు యాక్షన్లు..రియాక్షన్లు..
కోటలు దాటే మాటలు.. కోతలు..గుండెకోతలు..
మర్నాడు మామూలే..
ఇవీ అంతే..
ప్రజావేశం ఉన్నంతసేపే..
పక్కదారి పట్టేస్తే..పట్టించేస్తే
అధికారులు భద్రం..
అధికారాలు భద్రం..
ప్రభుత్వాలు భద్రం..
వ్యవస్థలే చిద్రం..
అవస్థలు యథాతధం..!
“దిశ”ఇది కాదు..
పదే పదే చెబుతున్నదదే..
శిక్ష..కోర్టులలో సరైన న్యాయం..
delayed justice is
denied jistice..
చందాన కాక
Right time..right decision..
నేరానికి తగిన..తగ్గని శిక్ష..
నిర్దిష్ట వ్యవధిలో..
చట్టం అంటే భయం కలిగేలా..
ఆడపిల్లని చూట్టం అంటేనే
దడ పుట్టేలా..
పిల్లలు పెరుగుతున్నప్పుడే నైతిక విలువలు పెరిగేలా చదువులలో కూడా సంస్కరణలు అవసరం..
మొత్తంగా నువ్వు..నేను..సమాజం..
మారితేనే..కథకు..వ్యధకు
ముగింపు..!
రమ్య కేసులో ఏడాదిలోగానే తీర్పు ఇచ్చిన గుంటూరు న్యాయమూర్తికి
శతకోటి వందనాలతో..
సురేష్ ఎలిశెట్టి..
9948546286