Suryaa.co.in

Andhra Pradesh

సందేశ్ ఖాలీలో భర్తల ఎదుటే అత్యాచారాలు, హత్యలు

– సందేశ్ ఖాలీ సంఘటనలు నిరసిస్తూ ఆందోళనలు
– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి
– బిజెపి శ్రేణులు తో ఆడియో కాన్ఫరెన్స్

విజయవాడ: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సందేశ్ ఖాలీ లో మహిళల పై అత్యాచారాలు, హత్య లు జరుగుతున్న ఘటనలు ను నిరసిస్తూ ఆందోళన లు చేపట్టాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపు ఇచ్చారు.

సందేశ్ ఖాలీ లో గత కొంత కాలంగా మహిళలు పై వరుస దాడులు, అత్యాచారాలు, హత్య లు వంటి దారుణ సంఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటన లు నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేయాలని పిలుపునిచ్చారు.

భర్తల ఎదుటే అత్యాచారాలు, హత్యలు జరుగడం పై గళం ఎత్తాలి. సమాజాన్ని చైతన్య పరిచి అక్కడ ఘాతకాలకు బలైన కుటుంబాలకు సమాజం అండగా ఉంటుంది అన్న సందేశం ఇచ్చే విధంగా ఆందోళన కార్యక్రమాలు ఉండాలని పిలుపునిచ్చారు.

ఈ మేరకు ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా బిజెపి శ్రేణులు తో మాట్లాడుతూ పురందేశ్వరి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సంఘటనలు ప్రస్తావించారు. ప్రతి జిల్లా కేంద్రంలో రేపటి నుంచి రెండు రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు చేయాలని బిజెపి క్షేత్ర స్థాయి నాయకత్వానికి పిలుపు ఇచ్చారు.

LEAVE A RESPONSE