రేవంత్.. దమ్ముంటే నాపై మల్కాజిగిరిలో పోటీ చేయ్

-కొడంగల్‌లో ఓడినప్పుడు ఏమైంది నీ మగతనం?
-కొడంగల్ లో ఓడిపోయినప్పుడు మగాడివి కాదా?
-జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు నువ్వు మగాడివి కాదా?
-టీజీ సీఎం రేవంత్‌కు బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ సవాల్

టీజీ సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన సవాల్ విసిరారు. రేవంత్ నిజంగా మగోడైతే కొడంగల్‌కు రాజీనామా చేసి, తనప మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసి గెలిచి తన మగతనం నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఆయన రేవంత్‌పై విరుచుకుపడ్డారు.

కేటీఆర్ ఏమన్నారంటే.. మగాడివి అయితే… రైతులకు 2 లక్షల రుణ మాఫీ చేయు… ఆడబిడ్డలకు 2500 ఇవ్వు… ఇచ్చిన 420 హమీలు అమలు చేయి. ఆడవాళ్లు రాజకీయాల్లో గెలవవద్దా… ఇందే మాటాలు? రేవంత్ కు ఇన్ పిరియారిటీ కాంప్లెక్స్ ఉంది. కొండగల్ సమయంలో పోటీ చేసి… సవాల్ విసరి పారిపోయిండు. ఆయన మాటకు విలువ ఏముంది?

రేవంత్.. కు దమ్ముంటే సిఏం కు రాజీనామా చేయండి. మల్కాజ్ గిరిలో పోటీ చేద్దాం. అదే ఆయన సిట్టింగ్ సీటే కదా? దమ్ముంటే పోటీకి రావాలి. నేను సిరిసిల్లాలో ఏంల్యేలకు పదవి రాజీనామా చేస్తా. దమ్ముంటే రేవంత్ సిఏం పదవికి రాజీనామా పోటీకి రావాలి.

నాది మేనేజ్ మెంట్ కోటా అయితే… రాహుల్, ప్రియంకాలది ఏం కోటా? రేవంత్ ది పేమేంట్ కోటా. ఠాకూర్ కి డబ్బులిచ్చి పదవులు తెచ్చుకున్న పేమేంట్ కోటా. పేమెంట్ కోటాలో సీటు తెచ్చుకున్నందుకే రేవంత్ ఢిల్లీ కి పేమేంట్ చేయాలి. బిల్డర్లను బెదిరించాలి. వ్యాపారులను బెదిరించాలి. డీల్లీకి కప్పం కట్టాలి, బ్యాగులు మోయాలి.

అందుకే భవన నిర్మాణ అనుమతులు అపినారు. ఎన్ని అనుమతులు ఇచ్చారో చెప్పాలి. త్వరలో బిల్డర్లు, వ్యాపారులు రేవంత్ సెస్ పైన రోడ్డు ఎక్కుతారు. ఆయన నేనే సిఏం అని అన్ని సార్లు చెప్పుకుంటున్నారు. అయనకు అయననే సిఏం అన్న నమ్మకం లేదా?

Leave a Reply