బిజెపిది జాతీయ వాదం.. మత వాదం కాదు

– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి

విజయవాడ….మతం పేరుతో విభజన చేసి ఓట్లు దండుకునే సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ ది అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నిప్పులు చెరిగారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో మైనారిటీ మోర్చా రాష్ట్ర స్థాయి సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

బిజెపి మతవాదం కాదు జాతీయ వాదం అంటూ నొక్కి వక్కాణించారు. దేశం లో ఉన్న అన్ని వర్గాల కు సంక్షేమం అందించడమే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ధ్యేయం అన్నారు. ట్రిపుల్ తలాక్ రద్దు తో పాటు మైనారిటీ లకు అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి అని పిలుపు ఇచ్చారు.

సమావేశానికి అధ్యక్షత వహించిన మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ మాట్లాడుతూ 108 ముస్లింలు కు పద్మాలు బిజెపి ప్రభుత్వం అందించిన విషయం ప్రస్తావిస్తూ మైనారిటీ ల్లో నైపుణ్యం ఆధారంగా నే అన్నారు. మతం పేరుతో విభజన చేసి లబ్ది పొందాలని కాంగ్రెస్ భావించింది న్నారు. అబ్దుల్ కలాం, బిస్మిల్లా ఖాన్ వంటి వారికి భారత రత్న లు ఇచ్చి గౌరవించిన ఘనత నరేంద్ర మోడీ ది అన్నారు.

బిజెపి సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ మాట్లాడుతూ కేంద్రం లో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీ లకు ఇచ్చిన ప్రాధాన్యత వివరించారు. మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ బాషా తదితరులు ప్రసంగించారు

Leave a Reply