Suryaa.co.in

Business News National

రు. 500 నోట్ల రద్దుపై ఆర్బీఐ స్పష్టత

– వెయ్యి నోట్లపైనా క్లారిటీ
– బ్యాంకులకు చే రిన 3.62 లక్షల కోట్ల రూపాయల పాత 2 వేల నోట్లు
– 85 శాతం తిరిగి బ్యాంకుల్లోనే డిపాజిట్ చేసిన వైనం

2 వేల రూపాయల నోట్లు రద్దు చేసిన ఆర్బీఐ.. కొత్త 500 రూపాయల నోట రద్దుపై ఎట్టకేలకు స్పష్టత ఇచ్చింది. 2 వేల రూపాయల రద్దు తర్వాత ఇక 500 రూపాయల నోటును కూడా, రద్దు చేసే ఆలోచన ఉందంటూ ప్రచారం జరిగింది. దానిపై ఇప్పటివరకూ ఆర్బీఐ స్పష్టత ఇవ్వకపోవడంతో, ప్రజలు కూడా అదే నిజమని నమ్మాల్సివచ్చింది.

కానీ ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, ఆలస్యంగానయినా దానిపై స్పష్టత ఇచ్చారు. 500 రూపాయల నోటు రద్దు చేసే ఆలోచన ఏదీ లేదని, అలాంటి పుకార్లను నమ్మవద్దని కోరారు. అదేవిధంగా కొత్తగా వెయ్యి రూపాయల నోటును చలామణిలోకి తెస్తున్నారంటూ, వస్తున్న ప్రచారానికి ఆయన తెరదించారు. అసలు అలాంటి ఆలోచన ఏదీ ఆర్బీఐకి లేదని స్పష్టం చేశారు.

ఇక రద్దు చేసిన 2 వేల నోట్లలో దాదాపు 85 శాతం బ్యాంకు డిపాజిట్లుగా తిరిగి వచ్చినట్లు వెల్లడించారు. మార్చి 31 వరకూ.. ఆ విధంగా రద్దయిన 2 వేల నోట్లు 3.62 లక్షల కోట్లు, బ్యాంకులకు చేరాయని వివరించారు. సో.. 500 రూపాయల నోటు రద్దుపై ప్రజలు, ఇక బేఫికర్‌గా ఉండవచ్చన్నమాట.

LEAVE A RESPONSE