హైకోర్టులో మంత్రి అంబటి రాంబాబు, చెవిరెడ్డి కి చుక్కెదురు
అమరావతి: తాను పోటీ చేసిన సత్తెనపల్లిలో రీ పోలింగ్ జరపాలనే మంత్రి అంబటి రాంబాబు పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత రీ పోలింగ్ జరపడం ఏంటి అని ప్రశ్నించింది. మంత్రి అంబటి రాంబబు వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. సత్తెనపల్లిలో 4 పోలింగ్ బూత్‌లలో అక్రమాలు జరిగాయని, రీ పోలింగ్ నిర్వహించాలని అంబటి రాంబాబు కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను విచారించి, కొట్టి వేసింది. మరోవైపు చంద్రగిరిలో స్క్రూటినీ రీ షెడ్యూల్ చేయాలని, రీ పోలింగ్ నిర్వహించాలని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను కూడా హైకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది.