– ఇథనాల్ కంపెనీతో నాకొడుకు సాయి కిరణ్ కు సంబంధం లేదు
– సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే.. కంపెనీ వాళ్ళకే రాసిస్తా
– పీసీసీ చీఫ్, మంత్రి సీతక్క, ఎంపీ చామల కామెంట్స్ ను ఖండించిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్: అసమర్ధతను కప్పి పుచ్చుకునేందుకే కాంగ్రెస్ నేతల తప్పుడు ఆరోపణలు. ఇథనాల్ కంపెనీతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. ఇథనాల్ కంపెనీతో నాకొడుకు సాయి కిరణ్ కు ఎలాంటి సంబంధం లేదు. నా కుటుంబ సభ్యులకు సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే.. కంపెనీ వాళ్ళకే రాసిస్తాను.
పీసీసీ చీఫ్ కు నా సవాల్. ఇథనాల్ కంపెనీపై ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధం. సందర్భం వచ్చినప్పుడు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తోన్న వారికి నేనేంటో చూపిస్తాను. ఇథనాల్ కంపెనీకి పర్మిషన్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు.. 2016 లో రాజమండ్రి ప్రాంతంలో నా కుమారుడు వేరే కంపెనీని పెట్టాలనుకున్నది వాస్తవం. అయితే మూడు నెలలకే కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశాడు.
కంపెనీ పెట్టించే వాళ్ళం మేమే అయితే.. రైతులను మేమెందుకు రెచ్చగొడతాం? బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని పేర్కొనడం విడ్డూరం. ఇథనాల్ కంపెనీకి అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అన్న విషయం కూడా తెలుసుకోరా? బాధ్యతగల పదవిలో ఉన్నవారు ఆచీతూచీ ఆరోపణలు చేయాలి. ప్రజల సమస్యను పరిష్కరించకుండా.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది.
నన్ను, బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసే ప్రయత్నం జరుగుతుంది. లగచర్ల సహా.. ప్రతిదానిలో కాంగ్రెస్ ప్రభుత్వం అభాసు పాలవుతుంది. లేనివి ఉన్నట్లు చెప్పటం దుర్మార్గమైన చర్య. రైతులు చేస్తున్న ఆందోళనను పరిష్కరించకుండా తప్పుడు ఆరోపణలు మానుకోవాలి. గురుకులాల్లో విద్యార్థుల మరణంపై హైకోర్టు మొట్టికాయలు వేసింది.