Suryaa.co.in

Political News

ఢిల్లీలో బీజేపీ ఓటమికి కారణాలివీ..

ఢిల్లీ నగరపాలిక ఎన్నికల్లో బిజెపి ఓటమికి కారణం, ప్రజల్లోని ఒక రకమైన అనివార్య మానసిక పరిస్థితులే…
కొన్ని వేలమంది ఎంపీలు, వారి అనుచరులు, చుట్టాలు‌, సంతానం, పైరవీకారులు, దేశ, విదేశీ రాయభార కార్యాలయాలు, వివిధ ప్రభుత్వ శాఖలలో పని చేసే పెద్ద ఉద్యోగులు, వారి పిల్లలు, డిఫెన్స్, హోం, పొర్లమెంటరీ, క్యాబినెట్ ఆఫీసులలో పనిచేసే ఉద్యోగులు, వారి పిల్లలు… ప్రదర్శించే హంగు, ఆర్భాటాలు, వారు చేసే ఖర్చులు, వారి ప్రవర్తన, వారి టెన్షన్లు, వారి బిజీ జీవితం…
ఒకవైపున…
వివిధ రాష్ట్రాలనుండి పొట్టచేతపట్టుకొని చిన్నచిన్న వ్యాపారాలు, పనులు చేసుకుంటూ జీవనం గడిపే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, బీద ప్రజలు… చాలీచాలని ఆదాయంతో నెట్టుకొస్తున్న జీవితాలు… మరోవైపు.
సాధారణంగా సామాన్య ప్రజల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
సహాజంగా వారు పై తరగతివారిమీద ఒక రకమైన వ్యతిరేకత, అసూయ కలిగి ఉండడం నిజం.
కాకపోతే, ఎవరినీ తప్పుపట్టలేము.
వివిధ దేశాలు, రాష్ట్రాలనుండి వచ్చిన పై తరగతి ప్రజలు సామాన్య ప్రజలతో ప్రేమ, ఆప్యాయత, కలుపుగొలుపుతనంతో ఉంటారు, ఉండాలి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. పక్కింటి వారినే పలకరించని రోజులలో వేరే దేశం, రాష్ట్రంలో కలివిడిగా ఉంటారనుకోవడం కరెక్ట్ కాదు…
అలాగే, సామాన్య ప్రజల ముందు ఆర్భాటం ప్రదర్శించడమూ కరెక్ట్ కాదు.
అలాగే…
మరోపక్క, ముస్లింలు, సిక్కులు తమకు ప్రాధాన్యం తక్కువైందని విద్వేషం పెంచుకోవడమూ, వారిని ఆప్ రెచ్చగొట్టడమూ అగ్నికి గాలి తోడైనట్లే…
బీజెపి 15ఏళ్ళ ఆంటీ ఇన్కంబెన్సీ ఇంకొక కారణం.
ప్రతీదానికి మోడీ మీద ఆధారపడడమూ ఒక కారణం.
ఆధార్ తో ఓటర్ కార్డు అనుసంధానించి డబుల్ ఓటింగ్ నివారణ చేయకపోవడమూ కొంత ప్రభావం చూపిండవచ్చు.
రోహింగ్యాలు, బంగ్లాదేశీల దొంగ ఓట్లూ కొంత కారణం.
ఆప్ డబ్బు, మధ్యం పంచడం, బీజెపి పంచకపోవడం,
కిందిస్థాయి నాయకత్వంలో ఇతరరాష్ట్రాల వారిని తక్కువగా ఉంచడం,
లోకల్ ఓట్లమీద ఎక్కువగా ఆధారపడడం…
ఇలా… కారణాలెన్నో…

– పెంజర్ల మహేందర్ రెడ్డి
అఖిల భారత ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు
జహిరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం

LEAVE A RESPONSE