లింక్ రోడ్లతో తగ్గిన దూరం.. పెరిగిన అనుసంధానం

-ముఖ్యమంత్రి కె. సి. ఆర్.ఆదేశాలతో మెరుగైన రవాణాకు మిస్సింగ్ లింక్ రోడ్లు అభివృద్ధి చేస్తున్న పురపాలక శాఖ
-హైదరాబాద్, దాని శివారు మున్సిపాలిటీలలో ప్రత్యామ్నాయ ప్రగతి మార్గాలుగా రూపొందుతున్న లింక్ రోడ్లు
-రోడ్ల అనుసంధానం కొరకు HRDCL ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం
-రూ.572 కోట్ల 17 లక్షలతో చేపట్టిన 37 లింక్ రోడ్లలో ఇప్పటివరకు 21 లింక్ రోడ్లు పనులు పూర్తయినాయి
-మరో 16 పనులు పురోగతిలో ఉన్నాయి
-కొత్తగా రూ.2410 కోట్ల అంచనాతో GHMC & 10 శివారు మున్సిపాలిటీలలో 104 లింక్ రోడ్లు మంజూరు చేసిన ప్రభుత్వం

GHMC, దాని శివారు ప్రాంతాల్లోని మున్సిపాలిటీలను అనుసంధానం చేయుటకు అవకాశం ఉన్న ప్రధాన రహదారుల అభివృద్ధి కోసం కంపెనీల చట్టం ప్రకారం హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (HRDCL) పేరుతో ఒక స్పెషల్ పర్పస్ వెహికల్‌ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరంలోని మిస్సింగ్ లింక్ కారిడార్లు, స్లిప్ రోడ్‌లను గుర్తించి అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు.

ఇవి భవిష్యత్ అభివృద్ధి రంగాలకు వెన్నెముకగా మారతాయి, రవాణా నెట్‌వర్క్‌ను మెరుగుపరచి, పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ సమస్యలను తగ్గించడంతో పాటు ప్రయాణ సమయాన్ని ఆదా చేసేimage ప్రత్యామ్నాయ మార్గాలుగా లింక్ రోడ్లను నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు . ఆయా ప్రాంతాల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించుటకు అధ్యయనం చేసిన తర్వాతనే ఈ లింక్, స్లిప్ రోడ్లను ప్రభుత్వం చేపడుతున్నది.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమును వినియోగించి భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల ప్రజలకు సులభతర రవాణా సదుపాయం కల్పిస్తున్నది. ప్రధాన కారిడార్ లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే ఈ లింక్ రోడ్ల నిర్మాణ ఉద్దేశ్యం.అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని మొత్తం 126.20 కి.మీ పొడవు కలిగిన 135 లింక్ రోడ్లను ప్రభుత్వం ఖరారు చేసింది. అందులో భాగంగా రూ.572image-1 కోట్ల 17 లక్షలతో 52.36 కిలోమీటర్లు చేపట్టిన 37 పనులలో రూ 273 కోట్ల 61 లక్షలు విలువైన 24 కి.మీ పొడవైన 21 పనులు పూర్తయినాయి. ఈ లింక్, స్లిప్ రోడ్లు ప్రజల వినియోగంలోకి వచ్చాయి. మరో 28.36 కిలోమీటర్లు పొడవున్న రూ.298 కోట్ల 56 లక్షల విలువైన 16 పనులు పురోగతిలో ఉన్నాయి. పూర్తయిన లింక్ రోడ్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మరో 104 రోడ్లు GHMC & దాని చుట్టుపక్కల 10 మునిపాలిటీ లలోని ప్రాంతాలను అనుసంధానము చేయుటకు రూ: 2410 కోట్ల అంచనాతో 104 లింక్ రోడ్లను ప్రభుత్వం మంజూరు చేసింది.

ఈ పనుల వివరాలు
—GHMC లో 95.47 కి.మీ పొడవున మొత్తం రూ. 1160 కోట్లతో 72 లింక్ రోడ్ల నిర్మాణం
—GHMC చుట్టుపక్కల ఉన్న 10 మున్సిపాలిటీలలో రూ. 1250 కోట్లతో 103.45 కి.మీ. లింక్ రోడ్ల నిర్మాణం
చుట్టుపక్కల మునిపాలిటీల వివరాలు:
(1) బండ్లగూడ జాగీర్ (ii) ఘట్కేసర్ (iii) కొత్తూరు (iv)దమ్మాయిగూడ (v) నాగారం (vi) బడంగ్పేట్ (vii) శంషాబాద్ (viii) ఇబ్రహీంపట్నం (ix) మణికొండ (x) జవహార్ నగర్ కార్పొరేషన్

HRDCL చే నిర్మించిన లింక్ రోడ్ల ద్వారా అనుసంధానం చేయబడిన ప్రాంతాలు
కారిడార్ నెం. ఖాజాగూడ సరస్సు పొడవునా 26-లింక్ రోడ్డు పొడవు 1.40 కి.మీ; వ్యయం రూ.31.12 కోట్లు
కారిడార్ నెం. 23 లింక్ రోడ్డు రోడ్ నెం. 45 నుండి లెదర్ పార్క్, ఓల్డ్ బొంబాయి హై వే వరకు పొడవు 1.20 కి.మీ; మొత్తం వ్యయం రూ.21.69 కోట్లు
కారిడార్ నంబర్ 23, పాత బాంబే హైవే (లెదర్ పార్క్) నుండి రోడ్ నెం. 45 వరకు నంది హిల్స్ వద్ద 0.35 కి.మీ పొడవున హెచ్‌టి లైన్ కింద VUP నిర్మాణం; మొత్తం వ్యయం రూ.30.30 కోట్లు
కారిడార్ నెం. 39A- ISB రోడ్డు నుండి ల్యాంకో హిల్స్ జంక్షన్ వరకు లింక్ రోడ్డులో కొంత భాగం పొడవు 1.94 కి.మీ; మొత్తం వ్యయం రూ.17.00 కోట్లు

కారిడార్ నెం. 01-నిజాంపేట్ X రోడ్ల నుండి హైటెక్స్ జంక్షన్ వరకు లింక్ రోడ్డు పొడవు 0.75 కిమీ; మొత్తం వ్యయం రూ.6.41 కోట్లు
కారిడార్ నం. 3:మియాపూర్ మెట్రో డిపో నుండి కొండాపూర్ వరకు, వ్యయం రూ 2.87 కోట్లు.
కారిడార్ నెం. 43-నోవాటెల్ నుండి RTA ఆఫీస్ వరకు లింక్ రోడ్డు, వ్యయం రూ 5.58 కోట్లు.
కారిడార్ నెం. 32- చిత్రపురి హిల్స్ మీదుగా ఖాజాగూడ రోడ్డుకు పాత బాంబే హైవే.పొడవు 950 మీ; మొత్తం వ్యయం రూ.15.07 కోట్లు.
కారిడార్ నం. 27 ఖాజాగూడ సరస్సు నుండి ORR వరకు ఉర్దూ యూనివర్సిటీ కాంపౌండ్ వాల్‌కి సమాంతరంగా. 1 కిమీ పొడవు, వ్యయం రూ.47.66 కోట్లు.
కారిడార్ నెం. 99- సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు నుండి పిర్జాదిగూడ రోడ్డు పొడవు 2.60 కి.మీ; మొత్తం వ్యయం రూ.25.60 కోట్లు, మరియు మొత్తం పొడవు 4.74 కి.మీ; మొత్తం ఖర్చు రూ.34.23 కోట్లు
పైన పేర్కొన్న కారిడార్‌లతో పాటు, 12.66 కిలోమీటర్లు పొడవైన 11 ఇతర మిస్సింగ్ లింక్ కారిడార్‌లను మొత్తం రూ 108.93 కోట్ల వ్యయంతో HRDCL నిర్మించింది.

Leave a Reply