-టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
-వాట్సాప్ నెంబర్ విడుదల
మంగళగిరి, మహానాడు: ప్రజా మేనిఫెస్టోపై వాట్సాప్ నెంబర్‌లో ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడిరచవచ్చని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తెలిపారు. ప్రజా మేనిఫెస్టోపై మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో కూటమి ముఖ్యనేతలు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్టీఏ కూటమి త్వరలో విడుదల చేయనున్న ప్రజా మేనిఫెస్టో కోసం ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, బీజేపీ నాయకుడు లంకా దినకర్, జనసేన నాయకుడు గాదె వెంకటేశ్వరరావు వాట్సాప్ నెంబర్ 8341130393ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ రాక్షస పాలను అంతం చేయడమే కూటమి లక్ష్యమన్నారు. కూటమికి ప్రజా మద్దతు పెద్దఎత్తున ఉందనడానికి కూటమి సభలకు తండోపతండాలుగా వస్తున్న జనమే నిదర్శనమన్నారు. కూటమి మేనిఫేస్టో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేదిగా రూపొందిస్తామన్నారు. చంద్రబాబు ఆదేశం ప్రకారం ప్రజాభిప్రాయం కోసం వాట్సాప్ నెంబర్‌ను ఏర్పాటు చేశామన్నారు. ప్రజల అభిప్రాయాలను గౌరవంగా స్వీకరిస్తామని పేర్కొన్నారు. కూటమి విజయం కోసం, రాక్షస పాలనను తరిమి కొట్టేందుకు ప్రజలు తమ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
జనసేన నాయకుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్ కోసం కూటమి ఏర్పడిరదని, అందుకే ప్రజా శ్రేయస్సు కోసం ప్రజా మేనిఫెస్టోను రూపొందిస్తున్నట్లు తెలిపా రు. దాని కోసం అభిప్రాయ సేకరణకు వాట్సాప్ నెంబర్‌ను షేర్ చేస్తున్నామని తెలిపారు.
బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఫలాలు చిట్టచివరి వ్యక్తికి అందించడమే కూటమి లక్ష్యమ న్నారు. వికసిత్ భారత్ సుసాధ్యం అయ్యేది వికసిత్ ఆంధ్రప్రదేశ్‌తోనేనని తెలిపారు. సంక్షే మం, అభివృద్ధే లక్ష్యంగా ప్రజా మేనిఫెస్టోను తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజా మేనిఫెస్టో కోసం అభిప్రాయాలను సేకరించేందుకు వాట్సాప్ నెంబర్‌ను విడుదల చేసినట్లు చెప్పారు.