Home » తెలుగు ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు

-ఉగాది పండుగ ప్రజల జీవితాల్లో ఉషస్సులు నింపాలి
– నందమూరి బాలకృష్ణ

తెలుగువారి సంవత్సరాది ఉగాది సందర్భంగా దేశ విదేశాల్లోని తెలుగువారందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది ప్రజలందరి జీవితాల్లో ఉషస్సులు నింపాలి. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలను అధిరోహించేలా శుభాలు కల్పించాలి.మన పండుగలు తెలుగు సంప్రదాయాలు, ఆచార సంస్కృతులతో అనుసంధానమై ఉండాలి. తెలుగువారి అస్తిత్వానికి చిరునామాగా నిలిచే వ్యవసాయ రంగం మరింత పురోభివృద్ధి సాధించాలి. ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి జీవితం వసంత రుతువులో చిరుగులా చిగురించాలి.

Leave a Reply