రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని, ప్రజల ఆశలు ఆకాంక్షలన్నీ నెరవేరాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి, రైతుల రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని ముఖ్యమంత్రి అభిలషించారు. నూతన సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించి, దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మన సంస్కృతి సంప్రదాయాలు చాటి చెప్పేలా ఉగాది పండుగను సంతోషంగా జరుపు కోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Devotional
రావి చెట్టు – వేప చెట్టును కలిపి ఎందుకు పూజిస్తారు?
మన పురాణాలు, సంస్కృతి, సంప్రదాయాలన్నీ ప్రకృతి ప్రాధాన్యతను ప్రతిఫలించేలా ఉండటం విశేషం. వాటిలో ముఖ్యంగా రెండు చెట్లు – రావి చెట్టు ( మరియు వేప చెట్టు – భారతీయ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనవి. వీటిని కలిపి పూజించడం ఒక ప్రాచీన ఆచారం మాత్రమే కాదు, గొప్ప ఆధ్యాత్మికత, వైజ్ఞానికత మరియు ఆరోగ్య రహస్యాలను కూడా…
ఈశ్వరుడి లీలా అపారమైనది
మనిషి శరీరంలోని వేళ్లపై ఉన్న చర్మం మీద రేఖలు రూపుదిద్దుకోవడం, శిశువు తల్లిగర్భంలో సుమారు నాలుగు నెలల వయసు ఉన్నప్పుడే ప్రారంభమవుతుంది. ఆ సమయంలో ఈ రేఖలు మాంసంపై జాలంలా…అంటే వలయంలా ఏర్పడతాయి. ఈ రేఖల ఏర్పాటుకు సమాచారం డిఎన్ఎ ద్వారా లభిస్తుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ రేఖలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ…
Sports
ఉప్పల్ స్టేడియానికి కొత్త రూపు
* రూ.5 కోట్ల వ్యయంతో ముస్తాబు * వేగంగా జరుగుతున్న ఆధునీకరణ పనులు * హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నేతృత్వంలో మైదానం మొత్తం పరిశీలించిన బీసీసీఐ, ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు ప్రకటించారు. బుధవారం…
భారత ఖోఖో జట్లకు శాప్ ఛైర్మన్ అభినందన
ఢిల్లీ వేదికగా జరిగిన ఖోఖో పురుషుల, మహిళల ప్రపంచకప్లో భారత జట్లు విజేతగా నిలవడం గర్వించదగ్గ విషయమని, ప్రపంచ వ్యాప్తంగా మహిళల విభాగంలో 23 దేశాల జట్లు, పురుషుల విభాగంలో 19 దేశాల జట్లు తలపడగా భారత జట్లు ప్రదర్శించిన ప్రతిభ అద్భుతమని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా…