Home » జగన్‍ కు వైఫ్ స్ట్రోక్

జగన్‍ కు వైఫ్ స్ట్రోక్

-సీఎం హోదాలోనే జగన్ జైలుకు
-భార్య కోసం బంధాలను తెంచేసి గెంటేశారు
-అవసరం తీరాక.. తల్లి, చెల్లిని గెంటేశారు
-జగన్ జైలుకు వెళ్తే భారతి సీఎం అయ్యేలా ప్లాన్ చేశారు
-జగన్ మద్యం వ్యాపారి లా మారారు
-కూటమి విజయం పక్కా.
-మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్‌రావు ఏపీ సీఎం-వైసీపీ అధినేత జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ‘భార్య భారతి చాటు భర్త’ అంటూనే.. సహజంగా చాలామందికి సన్‌స్ట్రోక్ ఉంటుందని, కానీ జగన్‌కు వైఫ్ స్ట్రోక్ అని చేసిన సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. భారతి కోసమే తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను వెళ్లగొట్టారని ఆరోపించారు. సీఎం హోదాలోనే జగన్ త్వరలో జైలుకు వెళ్లబోతున్నారు. జూన్‌లో జగన్ భార్య భారతి మాజీ ఎంపి వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కోబోతున్నారు. కొంతమంది విశ్లేషకులు డబ్బులు తీసుకుని పనిచేస్తున్నారు. ఎవరెంత రాసినా, ఎన్ని విశ్లేషణలు చేసినా ఏపీలో కూటమి అధికారంలోకి రావడం ఖాయం.

జగన్ జైలుకు వెళ్లిన తర్వాత భారతిని సీఎం చేసేలా వ్యూహరచన జరిగిందంటున్న గోనె ఇంకా ఏమన్నారంటే… సొంత తండ్రి వైఎస్‌ను ఎవరైనా పొగిడితే జగన్‌కు నచ్చదు. తనను పొగిడే వాళ్లంటేనే ఆయన ఇష్టం. తండ్రి సన్నిహితులనెవరినీ ఆయన దగ్గరకు రానీయరు. గతంలో తండ్రిని తిట్టిన వాళ్లకే ఇప్పుడు పెద్దపీట వేశారు. వివేకా హత్య కేసులో కచ్చితంగా అవినాష్‌రెడ్డి పాత్ర ఉంది. విజయమ్మను కన్నీళ్లు పెట్టుకునే మాట్లాడిన బొత్స ఇప్పుడు క్యాబినెట్‌లో ఉన్నాడు.

వైఎస్ ఏడుకొండలు మింగేశాడన్న దాడి వీరభద్రరావును తీసుకుని, వైఎస్‌కు నమ్మకమైన కొణతాలను దూరంగా పెట్టాడు. షర్మిలను అనవసరంగా వేధిస్తున్నారు. ఆమె ఇంటి దగ్గర ఇంటలిజన్స్ పోలీసులను కాపలా పెట్టారు. షర్మిల నాకు కూతురుతో సమానం. కానీ జగన్ కొడుకు లెక్క కాదు. ఎన్టీఆర్ చేసినన్ని సంక్షేమ పథకాలు ఎవరు చేశారు. కానీ కల్వకుర్తిలో ఆయన ఓడిపోలా? ఎన్టీఆర్‌కంటే జగన్ గొప్పోడా ఏంది? పొత్తు లేకపోయినా టీడీపీ 100 సీట్లతో గెలుస్తుంది.

ఏపీలో కూటమి విజయం తథ్యం. కూటమికి 130 నుంచి 145 స్థానాలు వస్తాయి. 19 నుంచి 21 లోక్‍సభ స్థానాల్లో కూటమిదే విజయం. పిఠాపురంలో పవన్ 50 నుంచి 60 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే జనసేన సీట్ల త్యాగం. జగన్ ఇష్టానుసారం పరిపాలన సాగించారు. మూడు రాజధానుల నిర్ణయం జగన్ చేసిన పెద్ద తప్పు. ఏపీలో అభివృద్ధి అనేదే లేదు. కనీసం రోడ్లు వేయలేదు. అవసరం తీరాక.. తల్లి, చెల్లిని గెంటేశారు.

జగన్ జైలుకు వెళ్తే భారతి సీఎం అయ్యేలా ప్లాన్ చేశారు. భార్య కోసం బంధాలను తెంచేసి గెంటేశారు. సన్ స్ట్రోక్ చూశాం.. జగన్‍కు వైఫ్ స్ట్రోక్ ఉంది. సీఎం హోదాలో జగన్ మద్యం వ్యాపారి లా మారారు. నాసిరకం మద్యం వల్ల మూడు వేల మంది చనిపోయారు . యువతకు ఉద్యోగం, ఉపాధి లేకుండా చేశాడు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం. కూటమి విజయం పక్కా. సర్వేలన్నీ బైబై వైసీపీ అంటున్నాయి.

Leave a Reply