టీడీపీ ప్రక్షాళన కావాలన్నది నా కోరిక

Spread the love

-కేశినేని చిన్ని కి పార్టీ లో సీటు ఇస్తే మద్దతు ఇవ్వను
-క్యారెక్టర్ ఉన్న పేదవాడికైనా సీటు ఇస్తే ఎంపీనే కాదు ఏదైనా చేస్తా
-విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

కేశినేని చిన్నే కాదు, మరో ముగ్గురు వ్యక్తులు టికెట్ ఇస్తే నా మద్దతు ఉండదు. నాకో క్లారిటీ ఉంది కరప్షన్ కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. నేను జీవితంలో ఎవరిని మోసం చేయలేదు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తిరిగే హక్కు ఉంది చార్లెస్ శోభరాజ్, దావుద్ ఇబ్రహీం సెక్స్ రాకెట్, కాల్ మని చేసేవాళ్ళు కూడా పోటీ చేసే హక్కు ఉంది. గాంధీ లాంటి మంచి వారికి సీటు ఇవచ్చు, దావుద్ ఇబ్రహీం లాంటి వారికి ఇవ్వొచ్చు ‌.

ఎన్టీఆర్ గొప్ప ఆశయం తో టీడీపీ స్థాపించారు. ఆ ఆశయంతో పనిచేయాలని ఉంటే చేయొచ్చు. కాదని ఇలాంటి వారికి సీటు ఇచ్చి పార్టీ సిద్ధాంతాన్ని పక్కదారి పట్టించాలంటే సీట్లు ఇవ్వొచ్చు.. నేను ఢీల్లి స్థాయి నాయకుడిని నా సేవలు పార్టీ కావాలంటే వాడుకోవచ్చు . నేను ఎంపీ అయితేనే ఈ స్థాయి రాలేదు. నాకు ఒక బ్రాండ్ ఉంది. ఎంపీ కాకపోతే టాటా ట్రస్ట్ లాంటివి తెచ్చి సేవ చేస్తానేమో.

కేశినేని చిన్ని కి పార్టీ లో సీటు ఇస్తే మద్దతు ఇవ్వను. క్యారెక్టర్ ఉన్న పేదవాడికైనా సీటు ఇస్తే ఎంపీనే కాదు ఏదైనా చేస్తా. కానీ చీటర్స్, లాండ్ మాఫియా డాన్ లకి,రియల్ ఎస్టేట్, మోసాలు చేసే వారికి, పేకాట క్లబ్ లు నడిపే వాళ్ళ కి మద్దతు ఇవ్వను.

Leave a Reply