ఇండియాలోనే నెం.1 – 420 జగన్మోహన్ రెడ్డి!

-జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం సమాజంలో చీలిక
-ఇన్వెస్టర్లలో నమ్మకానికి 10ఏళ్లు ప్రజాప్రభుత్వం ఉండాలి
-మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత లోకేష్

మంగళగిరి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం గత ఎన్నికల్లో కులాలను రెచ్చగొట్టారు, ఈసారి కులం, మతం, ప్రాంతం పేరుతో సమాజాన్ని నిట్టనిలువునా చీల్చే ప్రయత్నం చేస్తున్నారని టిడిపి యువనేత నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పైన్ వుడ్ అపార్ట్ మెంట్ నివాసితులతో యువనేత సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… సమస్యలు తెలుసుకునేందుకు నేను అపార్ట్ మెంట్ వాసులతో సమావేశమవుతుంటే పెత్తందార్ల ముద్ర వేస్తున్నారు, అపార్ట్ మెంట్లలో నివసించే వారు పెత్తందారులా అని ప్రశ్నించారు. భారతదేశం మొత్తమ్మీద జగన్ లాంటి దొంగ, 420 మరొకరు లేరు, ఆయన ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ లో కేసుల లిస్టే ఎక్కువగా ఉంది. ఎన్నికల్లో లబ్ధి కోసం సొంత బాబాయిని లేపేసి ఆ నెపాన్ని మాపై నెట్టే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మంగళగిరి ప్రాంతంలో రూ.1800 కోట్లతో ఎయిమ్స్ నిర్మిస్తే కనీసం వాటర్ కనెక్షన్ ఇవ్వలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి జగన్. కేంద్ర ప్రాయోజిత పథకాలకు మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వలేక నిధులు మురగబెట్టిన అసమర్థుడు.

దేశంలోనే పేరెన్నికగన్న వ్యాక్సిన్ కంపెనీ భారత్ బయోటెక్ కు కూడా కులరంగు పులిమారు. దీంతో ఆ సంస్థ ఒరిస్సా వెళ్లి రూ.1200 కోట్లు పెట్టుబడి పెట్టింది. జె-ట్యాక్స్ విధానాల కారణంగా అనేక పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లాయి. జగన్ దృష్టంతా అవినీతి సంపాదనపై తప్ప అభివృద్ధి, ఉద్యోగాల కల్పనపై లేదు. జగన్ రూ.12లక్షల కోట్ల అప్పుచేసి బటన్ నొక్కడంతో ఆ భారం ధరల పెంపు, పన్నుల రూపంలో తిరిగి ప్రజలపైనే పడుతోంది. చంద్రబాబు నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగిపోయిన వద్ద నుంచే అమరావతి పనులు ప్రారంభిస్తాం. దేశంలోనే మోడల్ సిటీగా అమరావతి నిర్మాణాన్ని పూర్తిచేస్తాం.

అమరావతి నిర్మాణం చేపట్టకుండా అయిదేళ్ల సమయాన్ని వృధా చేశామనే విమర్శలు సరికాదు. ప్రపంచంలోనే అతిపెద్ద ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ పూర్తిచేశాం, మాస్టర్ ప్లాన్, డిజైన్లు తయారుచేసి పనులు ప్రారంభించాం. ఒక మంచి ఇల్లు కట్టాలంటేనే కనీసం 3ఏళ్లు పడుతుంది. అలాంటిది రాజధాని నిర్మాణానికి సమయం పట్టదా? అయిదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారు. విధ్వంసక విధానాల కారణంగా దెబ్బతిన్న ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడాలంటే కనీసం పదేళ్లపాటు ప్రజాప్రభుత్వం ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రజలదే.

అయిదేళ్ల తర్వాత మళ్లీ ప్రభుత్వం మారితే మాత్రం యథావిధిగా తిప్పలు తప్పవని యువనేత లోకేష్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాలన్నీ భర్తీచేస్తాం. అధునాతన టెక్నాలజీతో నేరాలకు చెక్ పెడతాం. ప్రభుత్వానికి సమాంతరంగా నేను గత అయిదేళ్లుగా మంగళగిరిలో సొంతనిధులతో 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా. నన్ను గెలిపిస్తే మంగళగిరిని అభివృద్ధిలో పరుగులు తీయిస్తానని యువనేత చెప్పారు.

Leave a Reply