పెదకూరపాడులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీల దాడి దుర్మార్గం

-హింసా రాజకీయాల్లో జగన్ రెడ్డిని మించిపోయిన వైసీపీ మూకలు
-వైసీపీ ఆగడాలు నచ్చక పార్టీ మారితే తప్పెలా అవుతుంది?
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. అచ్చెన్నాయుడు

ఓటమి భయంతో వైసీపీ మూకలు హింసా రాజకీయాలు చేస్తూ పేట్రేగిపోతున్నారు. అధికారమదంతో టీడీపీ కార్యకర్తపై దాడులు తెగబడుతున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు వైసీపీ కార్యాలయం తగలబడిన ఘటనలో టీడీపీ కార్యకర్తలు కంచేటి సాయి, దండ నాగేంద్ర జానీలపై అక్రమ కేసులు బనాయించారు. కంచేటి సాయిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. వైసీపీ నేతలే కార్యాలయాన్ని తగలబెట్టి ఆ నెపాన్ని తెలుగుదేశంపై మోపడం దుర్మార్గం. రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారడంలో వైసీపీ నేతలు …జగన్ రెడ్డిని మించిపోయారనడానికి ఈ ఘటనే నిదర్శనం. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు నుంచి కంచేటి సాయికి ప్రాణహాని ఉంది.

గతంలో ఎమ్మెల్యే అనుచరుడిగా పనిచేసిన సాయి వైసీపీ ఆగడాలు, వేధింపులు తట్టుకోలేక టీడీపీ కండువా కప్పుకున్నాడు. అప్పటినుంచి ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు సాయిపై కక్ష కట్టారు. సాయి ఇంటిపైన ఎమ్మెల్యే కుమారుడు కల్యాణ్ దాడి కూడా చేశాడు. అయినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దేనికి సంకేతం? జగన్ రెడ్డిని ఓటమి భయం వెంటాడుతోంది. ప్రజాగళం సభకు వచ్చాడన్న కారణంగా గిద్దలూరుకు చెందిన మునయ్యను వైసీపీ రౌడీలు నరికి చంపారు. ఆళ్లగడ్డలో ఇమాన్ అనే యువకుడిని బలితీసుకున్నారు. మాచర్లలో టీడీపీ కార్యకర్త సురేష్ కారు తగలబెట్టారు. ప్రజాస్వామ్యాన్ని పాతరేసి హింసా రాజకీయాలు చేస్తున్న జగన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదు. పోలీసులు ఇప్పటికైనా బాధితులకు అండగా నిలబడాలి. అకారణంగా టీడీపీ క్యాడర్ పై దాడులు చేస్తున్న వైసీపీ రౌడీలపై చర్యలు తీసుకోవాలి.

Leave a Reply