Suryaa.co.in

Andhra Pradesh

ప్రజాక్షేత్రంలోనే ఉంటా

– తాత్కాలికంగా ఓటమిని అంగీకరిస్తున్నా … ప్రస్తుతం మూడు అడుగులు వెనక్కి వేశా
-మూడు వారాల్లో ఎన్ని అడుగులు ముందుకు వేస్తానో చూస్కో జగన్మోహన్ రెడ్డి
– తప్పు చేసిన వారు తమ తప్పులను సరిదిద్దుకుంటారని ఆశాభావంతో ఉన్నాను
-లేకపోతే ప్రజలే సరి చేస్తారని మరింత ఆశాభావంతో ఉన్నా
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

రానున్న ఎన్నికల్లో తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఉంటానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు తేల్చి చెప్పారు. నరసాపురం స్థానాన్ని పొత్తు లో భాగంగా బిజెపికి కేటాయించగా, తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై ఎంతోమంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఫోన్లు చేశారని, మెసేజ్ పంపారని తెలిపారు. ప్రత్యేకించి మహిళలు తమ అభిమానాన్ని ప్రదర్శిస్తూ పంపిన మెసేజ్ లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

నా వద్ద ఉన్న రెండు ఫోన్లు మోగుతూనే ఉన్నాయని, వాటిని ఎత్తలేకపోయానని చెప్పారు. నాపై అభిమానం ఉన్న ఎంతోమంది ఇది నిజమేనా రాజుగారు… అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారని తెలిపారు. అయితే నేను ఎటువంటి ఆందోళనలో లేను. అలాగని ఆనందంగా ఉన్నానని చెప్పడం లేదని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు.

జీవితం అనేది ఆట వంటిది, దాన్ని నేను ఆడాను. సవాల్ ను స్వీకరించాలని తెలిపారు. నరసాపురం స్థానాన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ఆ ప్రత్యేక పరిస్థితులు ఏమిటో పిల్ల సజ్జల నడిపే వెబ్సైట్లు, నీలి కూలి మీడియా ఛానెల్స్ ఇప్పటికే వెల్లడించాయన్నారు. జగన్మోహన్ రెడ్డి, ఆర్, ఆర్ ఆర్ కు షాక్ ఇవ్వబోతున్నారని రాసి, ప్రసారాలు చేశారు. రఘురామకృష్ణం రాజుకు జగన్మోహన్ రెడ్డి బిజెపి నుంచి సీటు రానివ్వరని ముందే పిల్ల సజ్జల వెబ్సైట్లు, నీలి కూలి మీడియా ఛానల్స్ ముందే చెప్పారని గుర్తు చేశారు.

వాడు నన్ను డిస్ క్వాలిఫై చేయాలని చూశాడు. జైల్లో చంపే ప్రయత్నం చేశాడు. తన మతానికి చెందిన ఒక అధికారిని అడ్డం పెట్టుకొని, ఇక్కడి ప్రభుత్వ అధినేతలతో కుమ్మక్కై నన్ను అక్రమంగా అరెస్టు చేయించి జైల్లో చంపేందుకు చేసిన ప్రయత్నాలన్నింటిలోను విఫలమయ్యాడు. పోలీసులను అడ్డం పెట్టుకుని కూడా లేపేయాలని చూశాడు. కానీ ఫెయిల్ అయ్యాడు. ప్రతి ఒక్కరికి ప్రతిసారి విజయం దక్కదని, తాత్కాలికంగా జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

నా అపజయాన్ని అంగీకరిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఇంత పని చేస్తాడని, చేయగలడని తెలిసినప్పటికీ, ఏ మూలనో నాకు ఒక నమ్మకం విశ్వాసం ఉండడంతో తేలికగా తీసుకున్నానని తెలిపారు.

నాలుగేళ్లుగా పోరాడాను… ఇప్పుడు మూడు అడుగులు వెనక్కి వేస్తున్నా
గత నాలుగేళ్లుగా జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలు అరాచకాలపై పోరాటం చేశానని, ప్రస్తుతం మూడు అడుగులు వెనక్కి వేస్తున్నానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తాత్కాలికంగా జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయిన రానున్న రోజుల్లో ప్రజాబలంతో, ప్రజల అండతో ప్రతి వ్యక్తి చేత ముందడుగు వేయించి వాన్ని ఆద పాతాళానికి తొక్క పోతే నా పేరు రఘు కాదని సవాల్ చేశారు.

తాత్కాలికంగా అపజయాన్ని అంగీకరించాలి తప్పదన్న ఆయన, నరసాపురం స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభావం వల్ల నాకు కేటాయించలేదని చెప్పారు. సోము వీర్రాజుకు, జగన్మోహన్ రెడ్డికి ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే నన్న ఆయన, సోము వీర్రాజు ద్వారా జగన్మోహన్ రెడ్డి నాకు సీటు రాకుండా అడ్డుకోగలిగారని నాకున్న సోర్సెస్ ద్వారా తెలిసింది.

నరసాపురం స్థానం దక్కలేదు. ఈ స్థానం నుంచి పోటీ చేస్తానా? లేకపోతే మరొక స్థానం నుంచి పోటీ చేస్తానా? అన్నది కాలమే సమాధానం చెబుతుందని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి అనుకున్నది మాత్రం జరగనివ్వనని మరొకసారి స్పష్టం చేశారు.

జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసినా, ఆ పార్టీకి ఓటు వేసినా ఒకటేనన్న అపోహ కలిగించే ప్రయత్నంలో భాగమే ఇది
జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసిన ఆ పార్టీకి ఓటు వేసిన ఒకటే నన్న అపోహ ప్రజల్లో కలిగించి తన పబ్బం గడుపుకోవడానికి చేసిన ప్రయత్నమే ఇది అని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. నన్ను అభిమానించే వారందరినీ కొన్ని పార్టీలకు దూరం చేయాలనే కుట్రలో ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయినట్టే కనిపించినప్పటికీ, త్వరలోనే ప్రజలంతా రియలైజ్ అవుతారని చెప్పారు.

రానున్న ఎన్నికల్లో కచ్చితంగా కూటమి విజయం సాధిస్తుందని, జగన్మోహన్ రెడ్డి చీఫ్ ట్రిక్స్ పనిచేయవని తేల్చి చెప్పారు. నరసాపురం స్థానాన్ని బిజెపి నాయకత్వం శ్రీనివాస్ వర్మ అనే వ్యక్తికి కేటాయించిందన్న ఆయన, నాకు పదవే అనుభవించాలని కోరిక ఉంటే ఆ పనికిమాలిన వాడికి తలోగ్గితే… నాలుగేళ్ల పాటు ఢిల్లీలో ఉంటూ అజ్ఞాతవాసం గడపాల్సిన అవసరం ఉండేది కాదన్నారు.

పదవి అన్నదే ముఖ్యమని అనుకొని ఉంటే… నాకు పోరాడవలసిన అవసరమే లేదని చెప్పారు. పనికిమాలిన పార్టీలో చేరి ప్రజలకు అన్యాయం చేశానన్న కించిత్ గిల్టీ ఫీలింగ్ వల్లే ప్రాణాలకు తెగించి పోరాటం చేశానని చెప్పారు. అమరావతి రైతులకు చేసిన అన్యాయం, సొంత బాబాయిని హత్య చేసిన వైనం, కోడి కత్తితో తనని తానే పొడిపించుకున్నటువంటి ఆగడాలు చూసి తరువాత అంతరాత్మ ఒప్పుకోక జగన్మోహన్ రెడ్డి పై తిరుగుబాటు చేశానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

నేను జగన్మోహన్ రెడ్డి పై తిరుగుబాటు చేసే సమయంలో మరో 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా అతనే కొనసాగుతాడని ప్రజలతోపాటు ప్రతిపక్షాలు కూడా భావించే పరిస్థితుల్లో దాదాపు సంవత్సరన్నర నుంచి రెండో సంవత్సరాల పాటు ఒంటరిగా నేను యుద్ధం చేశానని గుర్తు చేశారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలతో పాటు దేశంలో ఉన్న తెలుగు వారందరికీ, జగన్మోహన్ రెడ్డిని అసహ్యించుకునే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమేనని గుర్తు చేశారు.

ఒక మంచి ఆశయంతో ఈ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై పోరాటం చేశాను. మంచి ఆశయాలు కలిగి ఉన్న తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడుతో కలిసి నడవాలని ఉద్దేశంతో, ప్రజల్లో ఎంతోమంది నాపై ఆదరాభిమానాలను కురిపిస్తున్నప్పటికీ, ఇంత మంచి పార్టీ ఉన్నప్పుడు, మరొక పార్టీ అవసరమేమిటని ఆలోచించానన్నారు.

అదే దృక్పథంతో ముందుకు వెళ్లాలని, ఇప్పటికీ అదే దృక్పథంతో కొనసాగుతున్నానని చెప్పారు. రాజకీయ వత్తిళ్ల కారణంగా రాజకీయంగా కొంత సెట్ బ్యాక్ వచ్చిన మాట వాస్తవమేనని, ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందన్నారు. తప్పులు చేసినవారికి సరి చేసుకోవడానికి సమయం ఉందన్న రఘురామకృష్ణం రాజు, పార్టీలు గత్యంతరం లేని పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉండవచ్చునని అన్నారు. కొంతమంది దీన్ని మోసం, అన్యాయమని అనవచ్చు, నేను మాత్రం మోసం అన్యాయం అని అనడం లేదన్నారు.

పార్టీలు అన్యాయం చేసిన ప్రజలు అన్యాయం చేయరనే నమ్మకంతో ఉన్నానని రఘు రామ కృష్ణంరాజు వెల్లడించారు. నాకు పదవి ముఖ్యం కాదని పునరుద్ఘాటించిన ఆయన, ఒక పదవిలో ఉంటే అన్యాయం చేస్తున్న వారిని ప్రశ్నించడంతోపాటు, మన వేదనను అవతలి వారు పరిగణలోకి తీసుకునే విధంగా ప్రశ్నించే గొంతు అవసరమని చెప్పారు.

నా గొంతు తెంపడానికి ప్రయత్నించినా కూడా ప్రజల పక్షాన నా గొంతును వినిపించానని పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిరంతరం ప్రశ్నించే గొంతు వినిపించే ప్రయత్నం లో ఉంటానన్నారు. ఒకవేళ తప్పు చేసిన వారు సరిదిద్దుకోకపోతే, ప్రజలే ముందుకు వచ్చి తప్పులు సరి చేస్తారన్న ఆశాభావంతో ఉన్నానన్న ఆయన, నన్ను ప్రేమించే పార్టీలు ఉన్నాయని, నన్ను ప్రేమించే వ్యక్తులు ఉన్నారనే విశ్వాసంతో తప్పకుండా ఎన్నికల్లో పాల్గొన్న పాల్గొనకపోయినా, ఇప్పటికే ఎంపీగా ఉన్నాను కాబట్టి కొంతమేరకు సమస్యలను పరిష్కరించగలిగానని చెప్పారు.

కూటమి విజయం సాధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశాక సమస్యలు అనేవి ఉండవని పేర్కొన్నారు. అయితే ప్రజాస్వామ్యం బలవకూడదని దృక్పథం నాకుంది. పక్క పార్టీలలో కూడా నిర్ణయాలను ప్రభావితం చేస్తున్న ప్రస్తుత పాలక పక్షాన్ని సమూలంగా నిర్మూలించడానికి ప్రజలతో కలిసి పోరాటం చేస్తానని తేల్చి చెప్పారు.

LEAVE A RESPONSE