బయట స్విచ్ వేస్తే హాలు లో లైట్ వెలగతాది అని ఓ సినిమాలో కామెడీగా అంటాడు.. అలాంటిదే ఈ రెఫర్డు పెయిన్.. మూలం పట్టుకోకుంటే వైద్యమంతా మారిపోతుంది,. అనవసర మందులు, అపార్ధాలు, వైద్యాలు జరిగిపోతాయి.
గుండెలో నొప్పికి ప్రధాన కారణం,. కాని ఆ నొప్పి గుండె దగ్గర రాకపోతే గుండెనొప్పి కానట్లు కాదు.. చాలామందికి ఎడమ చేతివైపు లేదా ఎడమ చేతి చిటికెన వేలు ఉంగరపు వేలు వైపు మాత్రమే నొప్పి రావచ్చు,. లేదా వీపులో నొప్పి రావచ్చు,, లేదా ఎడమ దవడ మీద రావచ్చు.. లేదా కడుపులో గ్యాస్ ట్రబుల్ లా రావచ్చు….
ఇక పరీక్షలు షురూ చేయాల్సి వస్తాది,. గ్యాస్ట్రబుల్ అని ఎండోస్కోపీ, చేతి నొప్పికి సర్వైకల్ స్పాండైలైటిస్ అని X-రేలు, MRI, అన్ని రక్తపరీక్షలు అలా జరిగిపోతాయి,, ఒక్కోసారి గుండెపరీక్షలే చేయరు,, తరువాత ఎపుడో తెలుస్తాది.. ఇదే మెడికల్ మాఫియా పరీక్షలు అనవసరంగా చేస్తారు అనేదానికి బీజం పడుతుంది… పరీక్షలు, కన్సూమరిజం, ఎందుకు? ఏమిటి? ఎలా? అనేదే ఈ పరీక్షలు కు మూలకారణం.. అసలు ECG, ట్రోపోనిన్ టెస్టు, ఛాతీనొప్పి ఈ 3 కలిస్తేనే హార్ట్ అటాక్ నిర్ధారించచ్చు,. చాలామంది ఒక ECGలోనే అంతా తెలుసుకోవచ్చు అనుకుంటారు…ECG ఒక బేస్ లైన్ పరీక్ష… ECGబాగుంటే అంతా గుండె బాగున్నట్లు కాదు….
ECG, ఎకో టెస్టు, ట్రెడ్ మిల్ టెస్టు మూడు పిల్లర్ లైతే నాలుగో పిల్లరే CT ఆంజియో లేదా ఆంజియోగ్రామ్.. ECG లో అనుమానమొస్తేనో లేకపోయినా ఎకో చేస్తారు.. అందులో హార్ట్ ఇంతకుముందే అటాక్ వచ్చి డామేజయిందా, ఫంక్షన్ ఎంత ఉంది, వాల్వు జబ్బులు, రంధ్రాలు ఉన్నాయా లేక పెద్దగా ఎన్లార్జయిందా అనేది తెలుస్తాది,. దానిని బట్టి ట్రెడ్మిల్ లేదా ఆంజియోగ్రామ్ చేస్తారు,, కొన్ని సమయాలలో వేగం ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా హోల్టర్ టెస్టు, EP స్టడీస్ చేయాల్సి వస్తుంది..
ఇవన్నీ చేయాలంటే ఓ 30 వేల నుంచి 50,00 వరకు అవతాది,. అక్కడే మనకు అనుమానం వస్తాది.. కాని నీ ప్రాణం నీదే కదా.. మెడికల్ పరిజ్ఞానం స్టాటిస్టిక్సు లో ఉంటాది,. ఇంతమందిలో ఇది పాజిటివ్ అని… అది ఒక వ్యక్తికి అన్వయించేకి పనికిరాదు.. పాతకాలం మాదిరి మందో చూర్ణమో ఇచ్చేకి వీలు కాదు.. 1980 తరువాత మెడికల్ లో కన్జూమర్ కోర్టు పరిధిలోకి వచ్చాక వైద్యం కమోడిటీగా మారింది.. వైద్యుల జ్ఞానానికి అనుభవానికి చోటులేదు.. అంతా పరీక్షలు ద్వారా నిర్ధారించాల్సిందే… డాకుమెంటరీ ఎవిడెన్సు ఉండాల్సిందే…
వైద్యం వ్యాపారమయింది అని వగచరాదు,. అది మంచిదే ప్రతిమనిషిని సపరేటుగా నిర్ధారించాల.. స్టాటిస్టిక్సు రోల్ ఇపుడు లేదు… అందుకే మనం రిపోర్టు నార్మల్ అనగానే హతాశులవతాము.. ఈ మాత్రందానికి ఇన్ని పరీక్షలు ఎందుకు అని మెడికల్ మాఫియా అని గళమెత్తుతాము.. కాని చాలామంది రాత్రిల్లు కడుపుమంట అని పాన్ టాపు గోళీ వేసుకుని పడుకుని ఓ దినం హఠాత్తుగా చనిపోవడం చూసి అయ్యో అయ్యో అనుకుంటాము.. RIP అంటాము.. మనకు వేరేవారు RIP అనకూడదంటే మనజాగ్రత్త మనదే…
అందుకే దీనికోసమే స్క్రీనింగ్ అనేది వచ్చింది,. స్క్రీనింగ్ అంటే కొండను తవ్వి ఎలకను పట్టడం… చాలామందికి రిపోర్టులు నార్మలే ఉంటాయి… కొందరే పాజిటివ్ అవతారు.. అక్కడే స్టాటిస్టిక్సు పని చేస్తాయి. ఉదాహరణకు 45 ఏళ్ళు దాటిన వారిలో గుండెజబ్బులు అధికంగా ఉంటాయి అని స్టాటిస్టిక్సు చెబితే వారికే స్క్రీనింగవతాది.. అలా అని 45 లోపు వారికి రావని కాదు..వైద్యులు అనుమానపడితే 45 లోపు వారికి పరీక్షలు చేయాల్సిందే…. అంతలోనే మెడికల్ మాఫియా అని గగ్గోలు పెడితే స్టాటిస్టిక్సు సమాధానం చెప్పవు…
కావున నొప్పి ఎక్కడుంటే జబ్బు అక్కడే ఉందని కాదు.. పరీక్షలు నార్మలయితే సంతోషపడాల,.బాధపడకూడదు.. రిస్కు ఫాక్టరులుంటే ఉంటే స్క్రీనింగు చేసుకోవాల,, అవన్నీ చేసినా ఆ ఫజిల్ సాల్వు చేసే అనుభవ వైద్యుడు ముఖ్యం.. చాలామంది సొంతంగా స్కానింగులు తీసుకొని సమాధానం చెప్పండి అని వైద్యులకు వాట్సప్ లో పెడుతుంటారు,.. పరీక్షల సమాహారము మరియు వైద్యుడు మేధస్సే ఆ పజిల్ సాల్వు చేయగలదు.. కావున మంచి వైద్యుని ఎన్నుకోవాల., క్రాస్ చెక్ అన్నివేళలా చేయకుండా సమస్య కనుక్కోవాల,. అదేకష్ఠమైనపని..తరువాత పరిష్కారం …
ప్రపంచంలో పరిష్కారం కల జబ్బులు 2% మాత్రమే,. నిర్ధారించగల జబ్బులు 10% అంతే…
మిగతాదంతా జగన్మాయ… అపుడే మెడికల్ మాఫియా అనో, ఆపతి ఈపతి అని, దైవకృప అనో ఎవరి దారి వారు చూసుకుంటారు.. ఈ పరీక్షలు, వైద్యులు, వైద్యం, మెడికల్ మాఫియా అని నిర్వేదానికి లోనవుతాము,. అపుడు గంగాజలమే ఔషధం అవుతుంది,, ఆ దేవుడే దిక్కవతాడు,, మన రోగం కుదుటపడేంత వరకు మనకు మిత్రుడవతాడు,.
శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కళేబరే!
ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణో హరిః!!
అచ్యుతానంత గోవింద నామోచ్ఛారణ భేషజాత్ !
నశ్యంతి సకలారోగా: సత్యం సత్యం వదామ్యహం !!
ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశ హస్తాయ సర్వరోగ నివారణాయ త్రైలోక్య నాధాయ శ్రీ మహా విష్ణవే నమః
ఓం ధన్వంతరయే ఔషధచక్ర నారాయణాయనమః!!