Suryaa.co.in

Telangana

రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు కేసీఆర్ మానస పుత్రిక

– అబద్దాలు చెప్పడంలో సీఎం,మంత్రులు పోటీ
– భూసేకరణకు 100 కోట్ల రూపాయలు కేంద్రం వద్ద డిపాజిట్ చేశాము
– రీజినల్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం
– రీజినల్ రింగ్ రోడ్డును తమ భూముల చూట్టూ అలైన్ మెంట్ మార్చే యత్నం
– మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: ఉత్తర రీజినల్ రింగ్ రోడ్డుపై మంత్రి కోమటిరెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారు. అబద్దాలు చెప్పడంలో సీఎం,మంత్రులు పోటీ పడుతున్నారు. కేసీఆర్ హయాంలో చేసిన పనులను తాము చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు.

రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు కేసీఆర్ మానస పుత్రిక. దూరదృష్టితో రీజినల్ రింగ్ రోడ్డుకు కేసీఆర్ రూపకల్పన చేశారు. 27 వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డును ఏర్పాటు చేయాలని భావించారు. హైదరాబాద్ చుట్టూ వున్న 14 నేషనల్ హైవేస్ ను కలుపుకుని రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం నుండి అంగీకారం తీసుకుని, భూసేకరణకు 50 శాతం రాష్ట్రం నుండి ఇస్తామని కేసీఆర్ కేంద్రానికి చెప్పారు. 2017 లో కేంద్రం అంగీకారం తెలిపింది. కేంద్రం ఆలస్యం చేస్తుంటే, 2018లో కేసీఆర్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు.

2019 లో నేను రాష్ట్ర మంత్రిగా రీజినల్ రింగ్ రోడ్డుపై కేంద్ర మంత్రి గడ్కరీని కలిశాను. భారతమాల పేజ్1 లో ఉత్తర రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును చేపడుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2021 కరోనా సమయంలో మళ్లీ కేసీఆర్,మేము కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి రీజినల్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ అప్రూవ్ చేయాలని కోరాము 2021 డిసెంబర్ 6వ తేదీన కేంద్రం రీజినల్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ అప్రూవల్ చేసింది.

భూసేకరణకు 100 కోట్ల రూపాయలు మేము కేంద్రం వద్ద డిపాజిట్ చేశాము. కేంద్రం 2వేల కోట్లు డిపాజిట్ చేయాలని చెప్పింది. ఓ.ఆర్.ఆర్ వెళ్లే నాలుగు జిల్లాల్లో 76 శాతం భూసేకరణ
పూర్తి చేశాము. భూసేకరణ కోసం ప్రతి జిల్లాకు స్పెషల్ ఆఫీసర్ ను పెట్టాము. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 13 నెలల కాలంలో మేము భూసేకరణ కోసం పెట్టిన వంద కోట్లలో ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు.

రీజినల్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం. రీజినల్ రింగ్ రోడ్డుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు చేసిందా చెప్పాలి. ఢిల్లీకి వెళ్లి బ్రతిమిలాడుకొని నేషనల్ హైవే వాళ్ళతో టెండర్లు పిలిపించుకున్నారు. టెండర్లు పిలిచాక 161 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డుకు నేషనల్ హైవే నెంబర్ లేదు. పర్యావరణ అనుమతులు లేవు. పర్మిషన్లు లేకపోతే టెండర్లు అనుమతి పొందవు. దక్షిణ భాగం రీజినల్ రింగ్ రోడ్డుపై దోపిడీ వ్యవస్థ నడుస్తోంది.

దక్షిణ భాగం రీజినల్ రింగ్ రోడ్డుకు బిఆర్ఎస్ హయాంలోనే సూత్రప్రాయంగా కేంద్రం అంగీకారం తెలిపింది. దక్షిణ భాగం రీజినల్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పులు చేయాలని చూస్తున్నారు. దక్షిణ భాగం రీజినల్ రింగ్ రోడ్డుకు 15 వేల కోట్లు అవుతాయి. కేంద్రం అంగీకారం తెలిపిన దక్షిణ భాగం రీజినల్ రింగ్ రోడ్డును తమ భూముల చూట్టూ అలైన్ మెంట్ మార్చే యత్నం చేస్తున్నారు. దక్షిణ భాగం రీజినల్ రింగ్ రోడ్డుతో తెలంగాణపై 12 వేల కోట్ల భారం మోపాలని చూస్తున్నారు.

దక్షిణ భాగం రీజినల్ రింగ్ రోడ్డును అలైన్ మెంట్ మార్చకుండా కేంద్రం నిర్మించే విధంగా చర్యలు తీసుకోండి. కేసీఆర్ ఆర్.వి.ఆర్ సొసైటీకి బుద్వేల్ లో పది ఎకరాల భూమి,పది కోట్ల ఫండ్ ఇచ్చారు. ఇంతమంది ముఖ్యమంత్రులు పాలించినా ఆర్.వి.ఆర్ సొసైటీకి ఒక్క రూపాయి ఇవ్వలేదు. నారాయణగూడలో 1200 గజాల స్థలాన్ని కేసీఆర్ ఆర్.వి.ఆర్ సొసైటీకి ఇచ్చారు. ప్రెస్ మీట్ లో కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ,బీ ఆర్ ఎస్ వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE