Suryaa.co.in

Andhra Pradesh

దాడిశెట్టి రాజా బెయిల్ పిటిషన్ తిరస్కరణ

– ఇక అరెస్టే తరువాయి

విజయవాడ: ఆంధ్రజ్యోతి విలేకరి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం మాజీ మంత్రి దాడిశెట్టి రాజా దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. మంగళవారం పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు, రాజా పిటిషన్ ను తోసిపుచ్చింది.

తుని నియోజకవర్గం తొండంగి మండలంలో ఆంధ్రజ్యోతి విలేకరిగా పనిచేసిన కాతా సత్యనారాయణ 2019 అక్టోబర్ 15న హత్యకు గురయ్యారు. ఎస్. అన్నవరంలోని తన నివాసానికి వెళుతున్న సత్యనారాయణను లక్ష్మీదేవి చెరువుగట్టుపై దుండగులు అడ్డగించి, కత్తులతో నరికి చంపారు.

హత్యకు సూత్రధారి వైసీపీ నేత దాడిశెట్టి రాజానేనని మృతుడి కుటుంబీకులు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు తుని రూరల్ పోలీసులు రాజాతో పాటు ఆరుగురిని నిందితులుగా చేర్చి కేసు నమోదు చేశారు. అయితే, రాజా మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ కేసు మరుగునపడిపోయింది.

బెయిల్ పిటిషన్ కొట్టేసిన నేపథ్యంలో, దాడిశెట్టి అరెస్టు అనివార్యమయింది. ఆ క్రమంలో ఆయనను నేడో రేపో అరెస్టు చేసే అవకాశం ఉంది.

LEAVE A RESPONSE