Suryaa.co.in

Andhra Pradesh

హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు దుర్మార్గం

– మాజీ మంత్రి దేవినేని ఉమా
– ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి ఎన్టీఆర్ పేరును తొలగించడంపై నిరసన తెలుపుతున్న మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్

విజయవాడ లోని డాక్టర్ నందమూరి తారకరామారావు హెల్త్ యూనివర్సిటీ పేరును తొలగింపును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు గొల్లపూడి జాతీయ రహదారిపై బైఠాయించారు. నిరసన తెలుపుతున్న దేవినేని ఉమా సహ తెదేపా నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

దేవినేని ఉమా ఏమన్నారంటే.. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు దుర్మార్గం.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ప్రతిష్టాత్మకంగా హెల్త్ యూనివర్సిటీని ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ పేరు తొలగింపుపై ప్రభుత్వం సిగ్గుపడాలి.151 సీట్ల మంద బలంతో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు

మార్చాలనుకుంటున్నారు. హెల్త్ యూనివర్సిటీలో మీ పాత్ర ఏంటి?విష జ్వరాలు, రోగాలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే పట్టించుకోని సర్కార్… గత ప్రభుత్వాలు చేసిన వాటికి తమ స్టిక్కర్లు అతికించుకొనే పనిలో ఉంది.తెలుగుదేశం పార్టీ అన్నా కాంటీన్లు ఏర్పాటు చేసి పేదలకు భోజనం అందిస్తుంటే దాడులు చేసి ధ్వంసం చేస్తున్నారు.హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించాలి.

LEAVE A RESPONSE