– టీఎస్‌పీఎస్సీకి రాజ్ భవన్ లేఖ
టీఎస్‌పీఎస్సీనిర్వహించిన మరియు నిర్వహించాల్సిన రిక్రూట్‌మెంట్ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీని తీవ్రంగా పరిగణించి, గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాల మేరకు రాజ్ భవన్, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శికి లేఖ రాసింది. లేఖలో, సమగ్ర విచారణకు ఆదేశించి, లీకేజీపై వివరణాత్మక నివేదికను కోరింది మరియు అసలైన అభ్యర్థుల భవిష్యత్తు మరియు ప్రయోజనాలను కాపాడటానికి ఇటువంటి దురదృష్ట సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలను తీసుకోవతమే కాకుండా బాధ్యులందరిపై పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటనపై 48 గంటల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని కూడా గవర్నర్ కార్యాలయం కోరింది.