– భారత రాష్ట్ర సమితి నిర్ణయాన్ని ఖండించిన TWJF
నిరంతరం ప్రజల గొంతుకను వినిపించే వి6 న్యూస్ ఛానల్, వెలుగు దినపత్రికలను బహిష్కరించాలనే బిఆర్ఎస్ నిర్ణయం సరైందికాదు . అప్రజాస్వామికం . తెలంగాణ ఉద్యమంలో మీడియా చేసిన త్యాగం అనేక త్యాగాలు చెసింది . తెలంగాణ ప్రజలను నిరంతరం చైతన్యం చేసిన తెలంగాణ మీడియాపై బిఆర్ఎస్ ప్రభుత్వం కక్షసాదింపు చర్యలకు దిగడం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చెయడమే . ఈ చర్యలను ఖండిస్తున్నాం . ప్రశ్నను అడ్డుకోవడం ఎవరికి సాద్యం కాదు. దానికి సమాధానం చెప్పాలిసిందే. నేడు పత్రికను బహిష్కరించిన పార్టీ , రేపు కేంద్ర ప్రభుత్వం పై ఎలా పోరాడుతుంది . తక్షణం వి6 న్యూస్ ఛానల్, వెలుగు దినపత్రికలను బహిష్కరించాలనే బి ఆర్ ఎస్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చేస్తున్నాం .