Suryaa.co.in

Andhra Pradesh

వైసిపిని వదిలి కాంగ్రెస్ లో చేరండి

– రాజ్యసభ మాజీసభ్యుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మెన్ నర్రెడ్డి తులసిరెడ్డి
– కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్ ఆరాచక పాలనపై కరపత్రాలు విడుదల…
– అదానీ వ్యవహారం లో మోడీ, వివేకా హత్య కేసులో జగన్ అదః పాతాలానికి పడిపోయారు..
– B అంటే బాబు J అంటే జగన్ P అంటే పవన్ అంటూ BJP అర్దాన్ని మార్చిన తులసిరెడ్డి

రాష్ట్రాన్ని అవినీతి ఆంధ్ర ప్రదేశ్,అప్పుల ఆంధ్ర ప్రదేశ్, అరాచక ఆంధ్ర ప్రదేశ్, బూతుల ఆంధ్ర ప్రదేశ్ గా బ్రష్టు పట్టించిన పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ.రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా,మైన్ మాఫియా,వైన్ మాఫియా,ఎర్రచందనం, ఎర్ర మట్టి లాంటి మాఫియా రాజ్యమేలుతుంది.రాష్ట్రంలో రైతులు, మహిళలు, ఉద్యోగులు, యువత, సర్పంచ్లు, కాంట్రాక్టర్ లు ఇలా అన్ని వర్గాల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర అసంతృప్తి. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య లక్ష్యం. రాష్ట్ర అభివృద్ధికై పంచముఖ వ్యూహం, ఆరు సూత్రాల అమలుతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది.

LEAVE A RESPONSE