అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నివాసంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు జాతీయ జెండా ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు 73 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గాంధీజీ, అంబేద్కర్ చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రజలకు పాథమిక హక్కులు కల్పిస్తూ….రక్షణగా నిలిచే రాజ్యాంగ నియమాలు అన్ని వేళలా అమలు అవ్వాలని చంద్రబాబు అన్నారు. భారత దేశ రాజ్యాంగం అత్యంత ఘనమైనదన్న చంద్రబాబు…రాజ్యాంగ రూపకర్తలను ఈ సందర్భంగా కొనియాడారు.