Suryaa.co.in

Andhra Pradesh

ప్రైవేట్ రంగంలో ఎస్సీ-ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలి!

-వి. ఎం. రవిశంకర్ ,జాతీయ ప్రధాన కార్యదర్శి,ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం

ఈ రోజు వెలగపూడి లోని రాష్ట్ర సచివాలయంలోని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామిని కలిసి దేశంలోని 60 కోట్ల ప్రజలు రోజుకు రెండు పూటలా భోజనం లేనివారు ఉన్నారని ప్రశాంత్ కిషోర్ తెలిపిన సందర్భంలో ప్రైవేట్ రంగంలో ఎస్సీ -ఎస్టీ లకు రిజర్వేషన్లు కల్పించాలి అని కోరడం జరిగింది.

ఈ పాలసీ 2007 నుంచి ఉత్తరప్రదేశ్లోని మాయావతి ప్రభుత్వం అమలు చేసిందని అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో MSME పాలసీలో కల్పనాత్రై ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019లో రిజర్వేషన్లు తీసుకొచ్చారని రెండు సంవత్సరాల క్రితం ఉత్పదేశం ఆదిత్యనాథ్ యోగి ఆధ్వర్యంలోని ప్రభుత్వం కూడా రిజర్వేషన్ పాలసీని క్యాబినెట్ రిజర్వేషన్ ద్వారా పాస్ చేసిందని గుర్తు చేయడం జరిగింది.

రెండు రోజుల క్రితం కేంద్ర న్యాయ సామాజిక న్యాయశాఖ మంత్రి రామదాసు అతవాలే కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని కోరడం జరిగింది. నిన్నటి రోజు అప్పనాదళ్ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ ప్రస్తుత ప్రైవేటీకరణ కాలంలో క్లాస్ ఫోర్ ఉద్యోగాలు ఔట్సోర్సింగ్ ద్వారా కల్పించడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు దూరమయ్యాయని కాబట్టి కనీసం నాలుగో తరగతి ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని కోరడం జరిగిందని తెలుపుతూ , దేశంలో ప్రస్తుతం దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఏకాభిప్రాయం కూడా సాధ్యమవుతున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎస్సీ ఎస్టీల సంక్షేమ గురించి కట్టుబడి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పించాలని కోరడం జరిగింది. మంత్రిని కలిసిన వారిలో సంఘం సలహాదారులు  ప్రొఫెసర్ దేవకుమార్ సభ్యులు రాజేంద్రప్రసాద్ సూపరింటెండెంట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ ఉన్నారు.

LEAVE A RESPONSE