Suryaa.co.in

Andhra Pradesh

మంత్రి అనగాని ఓఎస్డీగా రిటైర్డ్ ఐఎఎస్ బి.సుబ్బారావు

అమరావతి: రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ ఓఎస్డీగా రిటైర్డ్ ఐఎఎస్ బి.సుబ్బారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ హోదాలో ఉద్యోగ విరమణ తీసుకున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నౌడూరు గ్రామానికి చెందిన సుబ్బారావు ఎంకామ్, ఎంఫిల్ చేశారు. డిప్యూటీ తహసీల్దారుగా ఉద్యోగ ప్రయాణం ప్రారంభించిన సుబ్బారావు తహశీల్దార్, ఆర్డీవో, జిల్లా రెవిన్యూ అధికారి, జాయింట్ కలెక్టర్ గా రెవిన్యూ అంశాల్లో అపార అనుభవాన్ని గడించారు.

గతంలో చిన్న పొదుపు మొత్తాలు డిప్యూటీ డైరెక్టర్ గా, ఈ సేవా ఓఎస్డీగా, జిల్లా పర్యాటక అధికారిగా, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ గా, ఏపీ ఐఐసి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గా, విశాఖ పట్నం పోర్ట్ ట్రస్ట్ ఎస్టేట్ ఆఫీసర్ గా, గుంటూరు, క్రిష్టా జిల్లాలకు జడ్పీ సీఈవో గా కూడా పని చేశారు. ఉద్యోగ నిర్వహణలో చేసిన సేవలకు గాను అనేక మార్లు గవర్నర్, ముఖ్యమంత్రి నుండి ప్రశంసాపత్రాలను కూడా సుబ్బారావు అందుకున్నారు.

LEAVE A RESPONSE