– వరద బాధితుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై స్పందన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
కరీంనగర్: వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వరదలతో రాష్ట్ర ప్రజలు అష్టకష్టాలు పడుతుంటేమొద్దు నిద్ర పోతున్నది రేవంత్ సర్కార్. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లాలన్నా హెలికాప్టర్ దొరుకుతుంది. కానీ వరదలో చిక్కుకున్న ప్రజలకు కాపాడేందుకు హెలికాప్టర్ దొరకదా?
కేసీఆర్ పాలనలో వరదల సమయంలో వరద బాధితుల ఆపత్కాలంలో కంటికి రెప్పలా నిలిచారు. గతంలో వరదలు వస్తే కెసిఆర్ స్వయంగా పరామర్శించి.. ధైర్యాన్ని ఇచ్చారు. తక్షణ సాయం కింద ములుగు జిల్లాకు రూ.2.5కోట్లు, భూపాలపల్లికి రూ.2కోట్లు, మహబూబాబాద్‌కు రూ.1.50కోట్లు విడుదల చేశారు.
గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారం అందిస్తామని చెప్పారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు. మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని రూ. 25 లక్షలు పరిహారం ప్రకటించండి.