Suryaa.co.in

Telangana

రేవంత్.. హిందూ సంస్కృతిని అవమానిస్తావా?

– గాంధీది అహింసాయుత సిద్ధాంతమైతే గద్దర్‌కు అవార్డు ఎలా సిఫార్సు చేశావు?
– రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ని మహ్మద్ గజనీతో పోల్చతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన వ్యాఖ్యలు హిందూ ధార్మికతను అవమానించేలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి మాటలు దిగజారిన రాజకీయాలకు, చౌకబారు మాటలకు నిదర్శనం. మహ్మద్ గజనీ దేశాన్ని దోచుకున్నాడు, హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి మన సాంస్కృతిక వారసత్వాన్ని మట్టిలో కలిపాడు.

అలాంటి దోపిడీదారుడితో ప్రధాని నరేంద్ర మోదీ ని పోల్చడం రేవంత్ రెడ్డి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం తన ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని తిరిగి చాటుకుంటోంది. సోమనాథ్ ఆలయం, కాశీ విశ్వనాథ్ కారిడార్, అయోధ్య రామమందిరం వంటి ఆలయాలను పునర్నిర్మించి హిందువుల మనోభావాలను గౌరవించేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం సాంస్కృతిక పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు కేటాయించి, హిందూ దేవాలయాల వైభవాన్ని ప్రపంచానికి చాటిచెబుతోంది.

మహ్మద్ గజినీ మన దేశంపై దాడి చేసి హిందూ దేవాలయాలను ధ్వంసం చేయగా, ప్రధాని నరేంద్ర మోదీ ధ్వంసమైన దేవాలయాలను పునరుద్ధరించి, హిందూ దార్మికతను, గౌరవాన్ని పెంచారు. ఇది మకిలి పట్టిన చరిత్రను మార్చే ఉదాహరణ. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి అనే హోదాను కూడా మర్చిపోయి దిగజారుడు మాటలు మాట్లాడటం సిగ్గుచేటు. దేశాభివృద్ధి కోసం విశ్వమానవతా స్ఫూర్తితో పనిచేస్తున్న ప్రధాని మోదీ గారిని, మహ్మద్ గజినీతో పోల్చడం.. భారతీయ సంస్కృతిని అవమానించడం లాంటిదే.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హిందూ సంస్కృతిని అవమానించేలా ఉన్నాయి. హిందూ ధార్మికతను, మన సంప్రదాయాలను విమర్శించారు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడయే. గాంధీజీ పిలుపునిచ్చిన స్వదేశీ సిద్ధాంతాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా విస్మరించింది. విదేశీ కంపెనీలకు ప్రాధాన్యం ఇచ్చింది. బీజేపీ మహాత్మా గాంధీ గారి శాంతి, ఆహింస సిద్ధాంతాలను పాటిస్తూ, దేశాభివృద్ధి కోసం పాటుపడుతోంది.

గాంధీ గారి అహింస సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకంగా నక్సల్స్ మద్దతుదారులను ప్రోత్సహించడం, తెలంగాణలో మావోయిస్టులకు పరోక్షంగా మద్దతు ఇవ్వడం కాంగ్రెస్ తీరును బహిర్గతం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ “ఇండియా ఫస్ట్” అనే భావనను విస్మరించి, “ఫ్యామిలీ ఫస్ట్” అనే నినాదంతో ముందుకు సాగిందిడా.. తమ కుటుంబాల కోసం పనిచేస్తున్నారు.

LEAVE A RESPONSE