Suryaa.co.in

Telangana

రేవంత్ ఎందుకు చదువుకోలేదు?

– ఎందుకు విజ్ఞానవంతుడిగా కాలేక పోయారు ?
– రేవంత్ మంత్రి వర్గం లోనే భిన్నభిప్రాయాలు
– దేశాలతో కాదు ..మహారాష్ట్రతో రేవంత్ పోటీ పడాలి.
– మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య

హైదరాబాద్‌: దావోస్ పెట్టుబడులపై సీఎం రేవంత్ ,మంత్రి శ్రీధర్ బాబు పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్నారు. దావోస్ పెట్టుబడులను పెద్ద విజయంగా సీఎం చెబుతుంటే, మంత్రి శ్రీధర్ బాబు ఇది పెద్ద విజయం ఏమీ కాదన్నారు. ఉపాది అవకాశాలు పెరిగినపుడే పెట్టుబడులను విజయంగా భావిస్తామని శ్రీదర్ బాబు అన్నారు. రేవంత్ మంత్రి వర్గం లోనే భిన్నభిప్రాయాలు ఉన్నాయి సీఎం మొహం చూసి ఎవ్వరూ పెట్టుబడులు పెట్టలేదు. పెట్టుబడులు అనేవి నిరంతర ప్రక్రియ.

పదేళ్ళ కేసీఆర్ విధానాల ఫలితంగానే ఈ పెట్టుబడులు. మహారాష్ట్రకు 18 లక్షలు కోట్ల రూపాయలు పెట్టుబడులుగా వచ్చాయంటే ఫడ్నవీస్ గొప్ప తనం చూసి రాలేదు. అక్కడ ప్రభుత్వం మారి ఆరునెలలు కూడా కాలేదు. ప్రపంచ దేశాలతో పోటీ పడతా అని రేవంత్ అంటున్నారు. దేశాలతో కాదు ..మహారాష్ట్రతో రేవంత్ పోటీ పడాలి.

ఈ పెట్టుబడులు ఎందుకు వచ్చాయో వివరించడానికి సీఎం మంత్రులతో చర్చకు సిద్ధం.2014 ,2023 మధ్య 2 వేల స్టార్ట్అప్ కంపెనీలు వచ్చాయి. హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ కేసీఆర్ హయం లో 7 లక్షలు స్క్వేర్ ఫీట్ లకు పెరిగింది. ఐటీ ఇన్నోవేషన్ లో కేసీఆర్ హయం లో తెలంగాణ నాలుగు శాతానికి పెరిగింది.

2014 లో 3 లక్షలు ఐటీ ఉద్యోగాలు ఉంటె అది కేసీఆర్ విధానాల ఫలితంగా తొమ్మిది లక్షలకు పెరిగింది. ఏ రకంగా చూసినా కేసీఆర్ పదేళ్ల పాలన లో తెలంగాణ ఐటీ ,పారిశ్రామిక రంగం లో భారీ పురోగతి సాధించింది. వాస్తవాలను సీఎం రేవంత్ వక్రీకరిస్తున్నారు. అప్పుడు వేసిన విత్తనాలకు ఇపుడు కాయలు కాస్తుంటే రేవంత్ తన గొప్ప అని చెప్పుకుంటే ఎట్లా ?

స్కిల్ డెవెలప్మెంట్ అనేది వ్యక్తులను బట్టి ఆధారపడి ఉంటుంది. అన్ని అవకాశాలున్నా రేవంత్ ఎందుకు చదువుకోలేదు ,ఎందుకు విజ్ఞానవంతుడిగా కాలేక పోయారు ? రేవంత్ భాష ,స్వభావం ఆలా ఉండటానికి దేశం లో విద్యావకాశాలు లేక కాదు. కేసీఆర్ గురుకులాలు స్థాపించి అందరికీ ఉన్నత అవకాశాలు కల్పించారు.

LEAVE A RESPONSE