– కొండారెడ్డిపల్లి.. కొడంగల్ .. చింతమడక.. గజ్వేల్..ఎక్కడైనా చర్చకు రె‘ఢీ’
– 8 తారీకు ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వచ్చినా సరే
– ప్రిపేర్ కాకుండా వచ్చి బేసిన్ లు బెండకాయలు అంటే పరువు పోతుంది
– రేవంత్ రెడ్డి ముమ్మాటికీ కోవర్డే
– పేసిఎం రేవంత్ రెడ్డి
– రేవంత్ రెడ్డికి నల్లమల తెలంగాణలో ఉందో లేదో కూడా తెలియదు
– బేసిక్ నాలెడ్జ్ లేని రేవంత్ రెడ్డి కి 72 గంటల ప్రిపరేషన్ టైం ఇస్తున్నా
– చంద్రబాబు కోవర్డులాగా పనిచేస్తూ తెలంగాణ నీళ్లను ఏపీకి రేవంత్ రెడ్డి దోచిపెడుతున్నాడు
– రైతులకు ఎవరు ఏం చేశారో చర్చిద్దామన్న రేవంత్ రెడ్డి ఛాలెంజ్ ను స్వీకరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణలో ఏ పంటను అడిగినా, ఏ పైరును అడిగినా.. ఏ రైతును అడిగినా.. ఏ రైతు పక్కనున్న ఎద్దును అడిగినా వ్యవసాయాన్ని పండుగలా మార్చింది కేసీఆర్ అనే చెప్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు అన్నారు. బీఆర్ఎస్ తెచ్చిన రైతురాజ్యం మీద, కాంగ్రెస్ తెచ్చిన రాబందుల రాజ్యం మీద చర్చించడానికి తాను సిద్ధమన్నారు. ఎరువులను పంచడం కూడా చేతగాని రేవంత్ రెడ్డి, కేసీఆర్ లాంటి నాయకుడితో చర్చకు సిద్ధపడితే జనం నవ్వుతున్నారు
రైతుల పేరుతో రొటీన్ గా రంకెలు వేసిన రేవంత్ రెడ్డి ముచ్చట తీర్చడానికి ఆయన ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నానని తెలిపారు. 8 తారీకు ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వచ్చినా సరే. మీడియా ముందే చర్చిద్దాం. నీళ్లకు నీళ్లు పాలకు పాలు చేసేద్దాం. బురద చల్లి తప్పించుకుపోవడం రేవంత్ రెడ్డి కి అలవాటు.
అయితే బేసిన్లు, బెండకాయలని పరువు తీసుకోకుండా ఉండడానికి బేసిక్ నాలెడ్జ్ లేని రేవంత్ రెడ్డికి 72 గంటల ప్రిపరేషన్ టైం ఇస్తున్నానని చెప్పారు. ప్లేస్, టైం, డేట్ డిసైడ్ చేసి చెప్పాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలన నడవడం లేదన్న కేటీఆర్, చంద్రబాబు కోవర్డు రేవంత్ రెడ్డి పాలనే నడుస్తుందన్నారు. గురువు కోసం ఏపీకి తెలంగాణ నీళ్లను పారిస్తున్న రేవంత్ రెడ్డి ముమ్మాటికీ కోవర్డే అని విమర్శించారు.
రైతులకు ఎవరు మంచి చేశారన్న దానిలో చర్చించడానికి,ఛాలెంజ్ లు చేసుకోవడానికి కొత్తగా ఏంలేదు.ముఖ్యమంత్రి ముచ్చట పడి రొటీన్ గా రంకెలు వేశారు. ఆయన ముచ్చట తీర్చడానికి నేను చర్చకు సిద్ధం. ఆయన స్థాయికి కేసీఆర్ అవసరం లేదు నేను సరిపోతుంది. ఎప్పుడంటే అప్పుడు చర్చకు నేను రెడీ. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం ప్రిపేర్ కావడానికి టైం కావాలి.
గతంలో కూడా ప్రిపేర్ అయ్యే రాలేదని కాంగ్రెస్ నేతలు పరువు తీసుకున్నారు అందుకే 72 గంటలు టైం ఇస్తున్న. ప్రిపేర్ కాకుండా వచ్చి బేసిన్ లు బెండకాయలు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది. నల్లమల్ల పులి అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి నల్లమల తెలంగాణలో ఉందో లేదో కూడా తెలియదు. బేసిక్ నాలెడ్జ్ లేని రేవంత్ రెడ్డికి ప్రిపేర్ కావడానికి 72 గంటలకు టైం ఇస్తున్నాను.
ముఖ్యమంత్రి సొంతూరు కొండారెడ్డిపల్లి కాని, ఆయన నియోజకవర్గం కొడంగల్ లో కాని చర్చ పెడతారంటే నేను రెడీ. లేదంటే మా నాయకుడు కేసీఆర్ సొంత ఊరు చింతమడక లేదంటే ఆయన నియోజకవర్గం గజ్వేల్ కి వస్తానన్న ఓకే. ఊరు నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, సమయం, డేటు అన్నీ నీ ఇష్టం. మా పార్టీ తరఫున నీ సవాల్ ను నేను స్వీకరిస్తున్నాను. జగమెరిగిన సత్యాన్ని అర్థం చేసుకోలేని వారిని చవట అంటారు. నిజం తెలిసినా ఒప్పుకొని వారిని రేవంత్ రెడ్డి అంటారు.తెలిసినా తెలవనట్టు…కనిపించేదాన్ని కనబడనట్టు నటించేవారిని రేవంత్ రెడ్డి అంటారు. నీళ్లు, నిధులు ,నియామకాలు అనే నినాదంతో ఆనాడు మేము ఉద్యమాన్ని నడిపాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే నినాదంతో పనిచేస్తున్నారు కానీ తెలంగాణ ప్రయోజనాల కోసం కాకుండా ఆంధ్ర ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారు.
బనకచర్ల పేరుతో ఆంధ్రకు నీళ్లు పంపుతున్నారు. నిధులను ఢిల్లీకి పంపుతున్నారు. ఆయన తొత్తులు కొంతమందికి నియామకాలు ఇస్తున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా రైతుల విషయంలో కేసీఆర్ తీసుకున్నట్టు సాహసోపేత చర్యలు తీసుకోలేదు. ఇది అక్షర సత్యం.
9 ఏళ్ల కాలంలో సుమారు 9 బిలియన్ డాలర్ల డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో వేశామని మొన్న ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో చెబితే అక్కడున్న ప్రొఫెసర్లు,మేధావులు అందరూ ఆశ్చర్యపోయారు. తెలంగాణ నేల మీద రైతు రాజ్యం తెచ్చిందే కేసీఆర్. ప్రతి మండలంలో రైతులు ఎరువులు, యూరియా కోసం ధర్నాలు చేస్తున్న విషయం వాస్తవం కాదా? ఆధార్ కార్డు చూపిస్తే ఎకరాకు ఒక ఎరువుల బస్తా ఇవ్వాలని అధికారులకు నువ్వు చెప్పిన మాట నిజం కాదా ?
ఆంధ్రాకు కృష్ణా గోదావరి నీళ్లను తరలించడానికి హారతులు పట్టింది మీ పార్టీ నేతలే. మీ ఇందిరమ్మ రాజ్యంలో రైతులు బోర్లేసి బొక్క బోర్లా పడ్డారు అనడానికి బోర్ల రాంరెడ్డి నిదర్శనం కాదా? ఎమర్జెన్సీ విధించి ఎంతోమందిని అన్యాయంగా జైల్లో పెట్టిన ఇందిరమ్మ రాజ్యం గురించి మాట్లాడితే నికృష్టంగా ఉంది.
రైతు డిక్లరేషన్ లోని ఒక్క హామీని కూడా అమలు చేయకుండా సిగ్గు లేకుండా రైతుల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అసెంబ్లీలో పెడతావో, అంబేద్కర్ విగ్రహం దగ్గర పెడతావో చర్చ నీ ఇష్టం. కొండారెడ్డిపల్లె, చింతమడక, కొండగల్ లో ఎక్కడ చర్చ పెడతావో నువ్వే డిసైడ్ చేసుకో.
నెలకు 2500 ఎప్పుడు ఇస్తారని కోటి 68 లక్షల మంది ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారు. ఇస్తానన్న స్కూటీ ఏమైందని మా చెల్లెలు ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగ భృతి ఏమైందని మా తమ్ముళ్లు ఎదురు చూస్తున్నారు. రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో నింపుతానన్నా మాట ఎప్పుడు నిలబెట్టుకుంటావని నిరుద్యోగులు అడుగుతున్నారు.
సంపూర్ణ రుణమాఫీ ఎప్పుడు చేస్తావు? ఎకరాకు 15000 రైతు భరోసా ఎప్పుడు ఇస్తావో రైతుల ఎదురుచూస్తున్నారు. 4000 పెన్షన్ ఏమైందని పెద్ద మనుషులు ఎదురుచూస్తున్నారు. దళిత బంధు ఇస్తున్నందుకు దళితులు ఓట్లు వేస్తారా? రాహుల్ గాంధీ , ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసి వేణుగోపాల్ ఖాతాల్లో టకీ టకీమని డబ్బులు పడుతున్నాయి. పేసిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ కు తెలంగాణను ఏటీఎం లాగా మార్చాడు. రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా పాలన కాదు. కోవర్టు పాలన. చంద్రబాబు నాయుడు కోవర్డు రేవంత్ రెడ్డి పాలన.
మొన్నటిదాకా తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఆంధ్ర కోసం పనిచేసిన ఆదిత్య దాస్ ను తీసుకొచ్చి సాగునీటి సలహాదారుడుగా ఎవరైనా నియమిస్తారా? రేవంత్ రెడ్డి కోవర్ట్. అనుమానం అవసరం లేదు.