Suryaa.co.in

Telangana

బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదు.. టీఆర్ఎస్ ను ఉరి వేసినా తప్పులేదు

-చంద్రమండలంలో కూడా కేసీఆర్ పార్టీ పెట్టుకోవచ్చని ఎద్దేవా
-లిక్కర్ స్కాం పై ఎప్పుడైనా,ఎక్కడైనా విచారణకు సిద్ధం
-ఇప్పటివరకు కవిత ఇల్లు ఎందుకు సోదా చేయలేదు ?
-టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ప్రణాళికా బద్దంగా ముందుకెళుతున్నామన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. నియోజకవర్గంలో మండలాల వారీగా నేతలకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. నారాయణ పూర్ మండల బాధ్యతలు తాను తీసుకుంటున్నానని.. ముఖ్య నాయకులందరినీ నియోజకవర్గంలో ప్రచారానికి ఉపయోగించుకోవాలని నిర్ణయించామని రేవంత్ తెలిపారు.

రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టేందుకు సెప్టెంబర్ 18 నుంచి ప్రణాళిక బద్దంగా ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. అన్ని పార్టీల కంటే ముందు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ తమ అభ్యర్థులేవరో ప్రకటించుకోలేని స్థితిలో ఉన్నారని, ముందుగా అభ్యర్థిని ప్రకటిస్తే పార్టీలో వ్యతిరేకత వస్తుందని భయపడుతున్నారని విమర్శించారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి సేవలను గుర్తించి అధిష్టానం స్రవంతిని ఎంపిక చేసినట్లు తెలిపారు.

బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదు.. టీఆర్ఎస్ ను ఉరి వేసినా తప్పులేదు
బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదని..బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఇక టీఆర్ఎస్ పార్టీని ఉరివేసిన తప్పు లేదని.. గిరిజనుల భూములను ప్రభుత్వం గుంజుకుంటుందని రేవంత్ విమర్శించారు.

రాష్ట్రం శవాల కుప్పగా మారడానికి కారణం కేసీఆరే
రాష్ట్రం శవాల కుప్పలుగా మారడానికి కేసీఆరే కారణమని విమర్శించారు రేవంత్ రెడ్డి. నిరుద్యోగుల చావుకు టీఆర్ఎస్ కారణమన్నారు.మునుగోడులో ఆ రెండు పార్టీలకు బుద్ది చెప్పడానికి కాంగ్రెస్ ను గెలిపించాలని, కమ్యూనిస్టులు ఆత్మ ప్రభోదానుసారం కాంగ్రేస్ కు ఓటు వేయాలని కోరారు.

టీఆర్ఎస్,బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామా
జాతీయ రాజకీయాలు అంటూ కేసీఆర్ డ్రామాలాడుతున్నారని రేవంత్ విమర్శించారు. కేవలం కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలనే కలుస్తూ.. యూపీఏ భాగస్వాములను చీల్చాలని చూస్తున్నారన్నారు. బీజేపీతో కలిసి ఉన్న పార్టీలను ఇప్పటి వరకు కేసీఆర్ ఎందుకు కలవడం లేదని ప్రశ్నించారు. కనీసం పక్కనున్న జగన్ ను కూడా కేసీఆర్ కలవలేదన్నారు. చంద్రమండలంలో కూడా కేసీఆర్ పార్టీ పెట్టుకోవచ్చని ఎద్దేవా చేశారు. ప్రజల్ని మోసం చేయడానికే టీఆర్ఎస్, బీజేపీ కలిసి డ్రామాలాడున్నాయన్నారు.

ఎప్పుడైనా,ఎక్కడైనా విచారణకు సిద్ధం
లిక్కర్ స్కాం పై బీజేపీ బుద్దిలేని ప్రచారం చేస్తోందన్నారు రేవంత్. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు పదేపదే ఈ అంశంపై మాట్లాడుతున్నారని విమర్శించారు. సూదిని సృజన్ ఎవరితో కలిసి వ్యాపారం చేస్తున్నారో,tc1 ఆయనకు ఎవరితో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయో వివరాలు తీయాలని డిమాండ్ చేశారు రేవంత్. లిక్కర్ స్కాం విషయంలో తాను ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఏ విచారణకైనా నేను సిద్ధమేనని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో ఇప్పటివరకు కవిత ఇల్లు ఎందుకు సోదా చేయలేదని ఆయన ప్రశ్నించారు.

LEAVE A RESPONSE